Android : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ఎప్పటికప్పుడు తన ప్లే స్టోర్‌లో ఉన్న మాల్‌వేర్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినప్పటికీ అందులో వస్తున్న హానికర యాప్‌లకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రకమైన మాల్‌వేర్ కొన్ని యాప్స్ ద్వారా ఫోన్లకు వ్యాపిస్తోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రిఫ్ట్ హార్స్ అనే ఓ హానికర్ మాల్‌వేర్ ప్రస్తుతం కొన్ని యాప్స్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లకు వ్యాప్తి చెందుతుందని గూగుల్ తెలియజేసింది. అందులో భాగంగానే ఆ మాల్‌వేర్‌తో సంబంధం కలిగిన 136 యాప్స్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఇక ఆ జాబితాలో ఉన్న యాప్స్‌ను ఎవరైనా ఇప్పటికే ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని గూగుల్ తెలియజేసింది.
ఆ యాప్స్‌లో.. ఫోటో ల్యాబ్, మై చాట్ ట్రాన్స్ లేటర్, లాకర్ టూల్, కాల్ రికార్డర్ ప్రొ, సేఫ్ లాక్, ఫేస్ అనలైజర్, ఫిట్ నెస్ ట్రైనర్, మై లొకేటర్ ప్లస్, జోడియాక్ హ్యాండ్, లూడో క్లాసిక్, యూ ఫ్రేమ్, ఫైండ్ కాంటాక్ట్ వంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. వీటిని చాలా మంది వాడుతున్నారని, వెంటనే వీటిని ఫోన్ల నుంచి తొలగించాలని సూచిస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…