Anchor Suma : బుల్లితెర యాంకర్‌గా సత్తా చాటుతూ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది సుమ. ప్రస్తుతం జయమ్మగా తెగ హడావిడి చేస్తోంది. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఈమె సిల్వర్ స్క్రీన్‌పై జయమ్మగా సందడి చేయడానికి సిద్ధమైంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ మే 6న రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వెన్నెల క్రియేషన్స్ పతాకంపై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఎక్కువ రీచ్ సంపాదించేందుకు నిర్విరామంగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్ కార్యక్రమాలో పాల్గొంటోంది సుమ. అయితే తాజాగా తన చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు కనిపించగా.. దాని గురించి బదులిచ్చింది.
ఆ పచ్చబొట్టు గురించి తెలియాలంటే జయమ్మ పంచాయతీ సినిమా చూడాల్సిందేనని తెలిపింది. సెకండ్ ఆఫ్ లో దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుస్తుందని చెప్పింది. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమ కనకాలతోపాటు ఈ చిత్రంలో పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అనుష్క కుమార్ అందించగా, ఎడిటర్ రవితేజ గిరిజాల. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…