Anasuya : ఇంక చాలు.. ఆ ప‌ని చేయ‌ను.. గుణ‌పాఠం నేర్చుకున్నా.. అన‌సూయ షాకింగ్ కామెంట్స్‌..!

October 11, 2021 8:48 PM

Anasuya : గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ‌తో కొన‌సాగిన మా ఎన్నిక‌ల‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డి ఫ‌లితాలు వ‌చ్చాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొంది సంచ‌ల‌నం సృష్టించారు. దీంతో నాగబాబు, ప్ర‌కాష్ రాజ్‌లు మా స‌భ్య‌త్వానికి రాజీనామాలు కూడా చేశారు. అయితే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌లో ఈసీ మెంబ‌ర్‌గా పోటీ చేసిన అన‌సూయ త‌న సోష‌ల్ ఖాతాల్లో షాకింగ్ కామెంట్లు చేసింది.

Anasuya says she will not enter into politics ever again

ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌లో అన‌సూయ ఈసీ మెంబ‌ర్‌గా పోటీ చేసి గెలుపొందింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌కాష్ రాజ్ గెల‌వ‌క‌పోవ‌డంతో ఆమెతోపాటు గెలిచిన ఇత‌ర స‌భ్యుల‌కు విచారంగా ఉంది. అయితే అన‌సూయ త‌న సోష‌ల్ ఖాతాల్లో చేసిన పోస్ట్‌లు షాకింగ్‌గా మారాయి. నిజానికి ఆమె గెలిచింద‌ని ఆదివారం రాత్రి ప్ర‌క‌టించారు. కానీ తెల్లారేస‌రికి ఆమె ఓడిపోయింద‌ని చెప్పారు. దీనిపై కూడా అన‌సూయ పోస్టు పెట్ట‌డం విశేషం.

తాను ఇక‌పై ఎప్పటికీ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోన‌ని.. రాజ‌కీయాల్లో ఉంటే నిజాయితీగా ఉండ‌లేమ‌ని.. అందుకు త‌న‌కు స‌మ‌యం కూడా లేద‌ని.. త‌న‌కు త‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తే ముఖ్య‌మ‌ని.. అన‌సూయ త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. అలాగే తాను గుణ‌పాఠం నేర్చుకున్నాన‌ని కూడా అందులో కామెంట్ పెట్టింది. దీంతో ఆమె మా ఎన్నిక‌ల‌ను ఉద్దేశించే వ్యాఖ్య‌లు చేసింద‌ని ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

నిజానికి అన‌సూయ అంటే చాలా మంది అభిమానిస్తారు. కానీ ఆమె ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌లో ఈసీ మెంబ‌ర్‌గా పోటీ చేయ‌డం వ‌ల్ల కొంద‌రికి దూరం అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. అందువ‌ల్లే ఆమె విచారంగా ఈ పోస్టు పెట్టింద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌లో గెలిచిన వారు రాజీనామాలు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి వారు ఏం చేస్తారో చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now