Amazon : అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ వ‌చ్చేసింది.. టీవీలు, ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు..

Amazon : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప్ర‌తి ఏడాది ద‌స‌రా స‌మ‌యంలో నిర్వ‌హించేలాగానే ఈసారి కూడా గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఇప్ప‌టికే ఈ సేల్‌పై ప్ర‌క‌ట‌న చేయ‌గా.. ఇప్పుడు అధికారిక తేదీని ప్ర‌క‌టించింది. ఈ సేల్‌ను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వ‌హించ‌నున్నామ‌ని అమెజాన్ తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఈ సేల్‌లో అనేక ఆఫ‌ర్ల‌తోపాటు భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను కూడా అందివ్వ‌నున్నారు.

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండ‌గా.. ఈ సేల్ ముగింపు తేదీని ప్ర‌క‌టించ‌లేదు. కానీ దీపావ‌ళి పండుగ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై అమెజాన్ త్వ‌ర‌లో మ‌ళ్లీ ఇంకో తేదీని ప్ర‌క‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇక ఈ సేల్‌లో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌పై భారీ రాయితీల‌ను అందివ్వ‌నున్నారు. అలాగే అనేక ఆఫ‌ర్ల‌ను కూడా అందివ్వ‌నున్నారు.

Amazon

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ 11 ప్రైమ్ 5జి, రెడ్‌మీ ఎ1 ఫోన్ల‌ను లాంచ్ చేసి విక్ర‌యిస్తారు. అలాగే ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తారు. ఈ క్ర‌మంలోనే శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జి, ఐక్యూ 9టి, రెడ్‌మీ నోట్ 11, షియోమీ 11టి ప్రొ 5జి త‌దిత‌ర ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఎల్‌జీ గ్రామ్ ల్యాప్‌టాప్ పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తారు. టీవీలు, గృహోప‌క‌ర‌ణాల‌పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

ఈ సేల్‌లో కిచెన్ ఉత్ప‌త్తుల‌పై 70 శాతం వ‌ర‌కు రాయితీని అందివ్వ‌నున్నారు. అలాగే ల్యాప్‌టాప్‌ల‌పై 75 శాతం వ‌ర‌కు, అలెక్సా ఫైర్ టీవీ, కిండిల్ ఉత్ప‌త్తుల‌పై 55 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఎస్‌బీఐ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తారు. ఇక క్రెడిట్‌, డెబిట్ కార్డు ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందివ్వ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM