Coriander Leaves : కొత్తిమీర అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. మనం ఏ కూర చేసినా తప్పని సరిగా కొత్తిమీరను ఉపయోగిస్తాము. కొత్తిమీర వంటలకు రుచిని మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్క వంటలో కొత్తిమీరను విరివిగా ఉపయోగిస్తారు. అయితే కొత్తిమీర ద్వారా మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొత్తిమీరలో పీచుపదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలు కలిగి అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
2. కొత్తిమీరలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సాలిక్ యాసిడ్స్, పొటాషియం, ఐరన్, సోడియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
3. నోటి పూత, కడుపు ఉబ్బరం, అలర్జీ, నోటి దుర్వాసన వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక కప్పు కొత్తిమీర జ్యూస్ ను తాగితే ఫలితం ఉంటుంది.
4. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు కొత్తిమీర రసాన్ని తలపై మర్దనా చేయాలి. దీంతో క్షణాల్లో తలనొప్పి మాయం అవుతుంది. లేదా కొత్తిమీర జ్యూస్‌ను అయినా తాగవచ్చు.
5. ముఖంపై మచ్చలు, మొటిమలు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు కొత్తిమీర రసంలో కాస్త పసుపు కలిపి ముఖానికి రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…