Amani : తెలుగు సినీ ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా కేవలం తన నటనతోనే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని చూరగొంది. దక్షిణాదికి చెందిన ఎన్నో చిత్రాల్లో నటించి అనేక అవార్డులను కూడా పొందింది. అయితే బీజేపీకి చెందిన ఎన్నికల ప్రచారం పాల్గొనబోతూ ఈమె విమాన ప్రమాదంలో కన్నుమూసింది. ఈ క్రమంలోనే సౌందర్య 50వ జయంతి సందర్భంగా ఈమధ్యే అభిమానులు ఆమె గురించి తలచుకుని విచారం వ్యక్తం చేశారు. ఒక గొప్ప నటిని కోల్పోయామని ఆమె గురించి అనేక పోస్టులు పెట్టి సంతాపం తెలిపారు.
ఇక సౌందర్య తన నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా పొందింది. కన్నడలో వచ్చిన ద్వీప అనే మూవీకి గాను ఈమె నేషనల్ అవార్డును సాధించగా.. మరో రెండు నంది అవార్డులను, పలు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తెలుగులో ఈమె మొదటి చిత్రం మనవరాలి పెళ్లి. తరువాత వరుసగా రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, నంబర్ వన్, అమ్మోరు.. వంటి చిత్రాల్లో నటించింది. ఇవి ఆమెకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టాయి. అయితే సౌందర్య ఎన్నో చిత్రాల్లో నటించినా గ్లామర్‌ను ప్రదర్శించలేదు. అందాలను ఆరబోయలేదు. హద్దులు మీరి కూడా ప్రవర్తించలేదు. పద్ధతిగా నడుచుకుంది. అయితే సౌందర్య ఇలా ఎందుకు ఉంది ? అన్న వివరాలు తెలియవు. కానీ వీటిని సీనియర్ నటి ఆమని తెలియజేసింది.
అప్పట్లో ఆమని, సౌందర్య మంచి స్నేహితులు. ఆమె చనిపోయాక ఆమని చాలా బాధపడింది. అయితే ఇటీవల ఆమని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. సౌందర్య ఎందుకు గ్లామర్ షో చేయలేదో చెప్పింది. తాను గ్లామర్ షో చేయనని.. రేపు పెళ్లయ్యాక తన భర్త ప్రశ్నిస్తే తాను ఏం సమాధానం చెప్పాలని సౌందర్య అంటుండేదని.. అలాగే రేపు పెళ్లి అయి పిల్లలు పుట్టాక వారితో కలసి తన సినిమాలు చూస్తుంటే వాటిలో తన గ్లామర్ షోను చూసి పిల్లల ముందు తలదించుకోవాల్సి వస్తుందని.. కనుక ఆ పరిస్థితి రాకూడదని చెప్పే తాను గ్లామర్ షో చేయడం లేదని.. సౌందర్య అప్పట్లో తనతో ఈ విషయాలను చెప్పిందని.. ఆమని తెలియజేసింది. అయితే కుటుంబ పరువు ప్రతిష్టలకే సౌందర్య ఎక్కువ విలువ ఇచ్చేదని.. ఒక గొప్ప నటిని మాత్రమే కాకుండా, మంచి స్నేహితురాలిని కూడా కోల్పోయానని.. ఆమని చెప్పింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…