Akhil Akkineni : బుల్లితెర ప్రేక్షకులని బిగ్ బాస్ షో ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ షోని తమ సినిమాలని ప్రమోట్ చేసుకునేందుకు కూడా కొందరు సెలబ్స్ వాడుకుంటున్నారు. సీజన్ 5లో మాస్ట్రో టీంతోపాటు కొండ పొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీంలు వచ్చాయి. అయితే బిగ్ బాస్‌ని వాడుకొని తన సినిమాను రెండు సార్లు ప్రమోట్ చేసుకొనే అవకాశం అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కి దక్కింది.
అఖిల్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా దసరా పండగ సందర్భంగా మోస్ట్ ఎలిజిబులర్ బ్యాచిలర్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అప్పుడు సమంత హోస్ట్‌గాఉంది. ఈ దసరాకు అఖిల్, పూజా హెగ్డే ప్రత్యేకంగా పాల్గొని దసరాకి విడుదల అవుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గురించి ప్రమోట్ చేసుకున్నారు. ఒక నటుడు రెండు సార్లు బిగ్ బాస్ వేదికపై తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
బిగ్ బాస్ స్టేజ్ మీద మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ టీం ఎంతగా సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేలు బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. ఎవ్వరినీ పట్టించుకోకుండా ఈ ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయారు. హౌజ్‌మేట్స్‌తో పలు విషయాల గురించి మాట్లాడారు. పూజా హెగ్డేను ఇంప్రెస్ చేసే టాస్క్ ఇంటి సభ్యులకు నాగార్జున ఇచ్చేశాడు. అయితే శ్రీరామ్ తన వాయిస్‌తో పడగొట్టేందుకు సామజవరగమన అనే పాటను పాడేశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…