Aishwarya Bhaskaran : సినిమాలు అంటేనే రంగుల ప్రపంచం. అందులో పేరు ఉండి.. సినిమాలు హిట్ అయ్యేంత వరకు లేదా.. సినిమాలు చేస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ అవకాశాలు లేకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సినిమాల్లో బాగా అవకాశాలు వచ్చినప్పటి కన్నా అవకాశాలు లేనప్పుడే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. గతంలో ఎంతో మందీ నటీనటులకు ఇలాగే జరిగింది. ఒక దశలో సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తారు. కానీ జీవితం చివరి దశలో ఆదుకునే వారు ఉండరు. దీంతో దిక్కు లేని చావు వస్తుంది. అనాథ శవంలా తగలబెడతారు. ఇలాంటి పరిస్థితిని ఎంతో మంది జీవితాల్లో చూశాం. అయితే మరీ ఇంతటి దయనీయ స్థితి కాకున్నప్పటికీ ఆ సీనియర్ నటికి ప్రస్తుతం దాదాపుగా ఇదేలాంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య భాస్కరన్ ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తోంది.
ఐశ్వర్య భాస్కరన్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉంది. ఈ మేరకు ఆమే స్వయంగా ఈ వివరాలను ఓ పత్రికకు వెల్లడించింది. ఇప్పుడు తనకు అవకాశాలు లేవని.. చేతిలో డబ్బు కూడా లేదని.. కనుక వీధుల్లో తిరుగుతూ సబ్బులను అమ్ముకుంటున్నానని తెలిపింది. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దని విచారించింది. తాను మద్యం సేవించి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయలేదని.. తన కుటుంబం కోసమే ఖర్చు చేశానని వివరించింది. తనకు అవకాశాలు లేవని.. తనకు సహాయం చేసే నిర్మాతల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. అయితే సినిమాలు లేదా సీరియల్స్ ఎందులో అవకాశం వచ్చినా నటిస్తానని.. చివరకు ఏదైనా ఆఫీస్‌లో టాయిలెట్లు కడిగే ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తానని చెప్పింది. దీంతో ఐశ్వర్య భాస్కరన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కాగా ఈమె దక్షిణాది భాషలకు చెందిన అనేక చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటించింది. కెరీర్‌లో తొలి నాళ్లలో హీరోయిన్‌గా కూడా నటించింది. ఈమె 1994లో తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తరువాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఈమెకు పాప పుట్టిన తరువాత ఏడాదిన్నరకు భర్తతో విడాకులు తీసుకుంది. అయితే ఈమె కుటుంబం ఎక్కడ ఉంది.. ఈమెకు ఎవరూ ఎందుకు సహాయం చేయడం లేదు.. అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…