Aishwarya Bhaskaran : అత్యంత దారుణ స్థితిలో ఒక‌ప్ప‌టి హీరోయిన్‌.. వీధుల్లో స‌బ్బులు అమ్ముకుంటూ జీవ‌నం..

June 18, 2022 5:54 PM

Aishwarya Bhaskaran : సినిమాలు అంటేనే రంగుల ప్ర‌పంచం. అందులో పేరు ఉండి.. సినిమాలు హిట్ అయ్యేంత వ‌ర‌కు లేదా.. సినిమాలు చేస్తున్నంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ అవ‌కాశాలు లేక‌పోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సినిమాల్లో బాగా అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టి క‌న్నా అవ‌కాశాలు లేన‌ప్పుడే ప‌రిస్థితులు దారుణంగా ఉంటాయి. గతంలో ఎంతో మందీ న‌టీన‌టుల‌కు ఇలాగే జరిగింది. ఒక ద‌శ‌లో సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తారు. కానీ జీవితం చివ‌రి ద‌శ‌లో ఆదుకునే వారు ఉండ‌రు. దీంతో దిక్కు లేని చావు వ‌స్తుంది. అనాథ శ‌వంలా త‌గ‌ల‌బెడ‌తారు. ఇలాంటి ప‌రిస్థితిని ఎంతో మంది జీవితాల్లో చూశాం. అయితే మ‌రీ ఇంతటి ద‌య‌నీయ స్థితి కాకున్న‌ప్ప‌టికీ ఆ సీనియ‌ర్ న‌టికి ప్ర‌స్తుతం దాదాపుగా ఇదేలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కుమార్తె ఐశ్వ‌ర్య భాస్క‌రన్ ప్ర‌స్తుతం అత్యంత ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో జీవ‌నం సాగిస్తోంది.

ఐశ్వ‌ర్య భాస్క‌రన్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం అత్యంత దారుణంగా ఉంది. ఈ మేర‌కు ఆమే స్వ‌యంగా ఈ వివ‌రాల‌ను ఓ ప‌త్రిక‌కు వెల్ల‌డించింది. ఇప్పుడు త‌న‌కు అవ‌కాశాలు లేవ‌ని.. చేతిలో డ‌బ్బు కూడా లేద‌ని.. క‌నుక వీధుల్లో తిరుగుతూ స‌బ్బుల‌ను అమ్ముకుంటున్నాన‌ని తెలిపింది. ఈ ప‌రిస్థితి ఎవ‌రికీ రావొద్ద‌ని విచారించింది. తాను మ‌ద్యం సేవించి విచ్చ‌ల‌విడిగా డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌లేద‌ని.. త‌న కుటుంబం కోస‌మే ఖ‌ర్చు చేశాన‌ని వివ‌రించింది. త‌న‌కు అవ‌కాశాలు లేవ‌ని.. త‌న‌కు స‌హాయం చేసే నిర్మాత‌ల కోసం ఎదురు చూస్తున్నాన‌ని చెప్పింది. అయితే సినిమాలు లేదా సీరియ‌ల్స్ ఎందులో అవ‌కాశం వ‌చ్చినా న‌టిస్తాన‌ని.. చివ‌ర‌కు ఏదైనా ఆఫీస్‌లో టాయిలెట్లు క‌డిగే ఉద్యోగం ఇచ్చినా స‌రే చేస్తాన‌ని చెప్పింది. దీంతో ఐశ్వ‌ర్య భాస్క‌ర‌న్ ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

Aishwarya Bhaskaran selling soaps she is in very poor condition
Aishwarya Bhaskaran

కాగా ఈమె ద‌క్షిణాది భాష‌ల‌కు చెందిన అనేక చిత్రాల్లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించింది. కెరీర్‌లో తొలి నాళ్ల‌లో హీరోయిన్‌గా కూడా న‌టించింది. ఈమె 1994లో త‌న్వీర్ అహ్మ‌ద్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. త‌రువాత కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉంది. ఈమెకు పాప పుట్టిన త‌రువాత ఏడాదిన్న‌ర‌కు భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. అయితే ఈమె కుటుంబం ఎక్క‌డ ఉంది.. ఈమెకు ఎవ‌రూ ఎందుకు స‌హాయం చేయ‌డం లేదు.. అన్న వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment