Actress Pragathi : జీవితాన్ని సింపుల్‌గా ఉంచండి.. నటి ప్రగతి పోస్టు వైరల్‌..

March 5, 2022 9:45 PM

Actress Pragathi : సినిమా ఇండస్ట్రీలో తల్లి, వదిన, పిన్ని పాత్రలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుందని చెప్పాలి.

Actress Pragathi told birthday wishes to Nandini Reddy
Actress Pragathi

ఇక సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ప్రగతి నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫిట్‌నెస్‌ వీడియోలను షేర్ చేస్తూ ఎంతో క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే దర్శకురాలు నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో ఈమె ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది.

ఈ సందర్భంగా ప్రగతి స్పందిస్తూ.. రకక్షకునికి హ్యాపీ బర్త్ డే.. జీవితం మనం చూస్తున్నంత కష్టంగా లేదు.. దానిని సింపుల్ గా ఉంచండి. చిన్న చిన్న విషయాలను ప్రేమించండి, పెద్ద విషయాలు మీకు దారి చూపిస్తాయి, ఇప్పుడే జీవితం స్టార్ట్ అయింది, ముందున్నవి విజయాలు, వేడుకలు మాత్రమే. చాలా సినిమాలతో జ్ఞాపకాలు ఉన్నాయి నందు.. అంటూ దర్శకురాలు నందిని రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే దర్శకురాలిగా నందినిరెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment