Actress Archana : కెరీర్ ఆరంభంలో వేదగా పరిచయం అయి.. తరువాత అర్చనగా పేరు మార్చుకుని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది ఆమె. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అర్చన చక్కని నటి మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. వివాహం అయ్యాక సినిమాలకు దాదాపుగా దూరం అయ్యిందనే చెప్పవచ్చు. భర్తతో కలసి ఈమె ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. అయితే ఈమె తాజాగా ఓ కార్యక్రమంలో తన జీవితానికి చెందిన పలు విషయాలను తెలియజేసింది. ఈ సందర్బంగా అర్చన ఎమోషనల్ కూడా అయింది.
అలీతో సరదాగా అనే కార్యక్రమంలో భర్త జగదీష్‌తో కలిసి పలు విశేషాలను నటి అర్చన పంచుకుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామదాసు సినిమా చేస్తున్నప్పుడు తన వయస్సు చాలా తక్కువ అని.. సుమన్ రాముడిగా నటించారని.. ఆయన పక్కన తాను సీతాదేవిగా చేశానని.. అయితే ఈ క్రెడిట్ మొత్తం కె.రాఘవేందర్ రావుదే అని అర్చన తెలిపారు. ఆ తరువాత తనకు మళ్లీ సినిమాలో అవకాశం ఎప్పుడు ఇస్తారు ? అని ఆయను అడిగానని అర్చన తెలిపారు.
ఇక బాలకృష్ణకు గోపికలతో డ్యాన్స్ చేయడాన్ని తానే నేర్పించానని.. ఇందుకు ఆయన తను ప్రశంసించారని అర్చన తెలియజేసింది. అలాగే రాజమౌళి తీసిన సినిమాల్లోనూ నటించానని.. యమదొంగలో ఓ సాంగ్‌లో చేయగా.. మగధీరలో మాత్రం ఒక క్యారెక్టర్‌కు ఆయన అడిగితే నో చెప్పానని.. అది తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అన్నారు. ఆ సినిమాలో నటించి ఉంటే తన గ్రాఫ్ ఇంకోలా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…