Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు వంటి నటుల ప్రభంజనంలోనూ చిరంజీవి నిలదొక్కుకుని స్టార్‌గా ఎదిగారు. ఆయన సినీ ప్రస్థానంలో మూడు దశాబ్దాల హీరోయిన్లతో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన కెరీర్‌లో చాలా మంది హీరోయిన్లతోనూ నటించారు. అయితే ఓ ముగ్గురు హీరోయిన్లతో చిరంజీవి చేయగా.. వారు ముగ్గురూ అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. ఇంతకీ ఆ అక్కా చెల్లెళ్లు ఎవరు.. అంటే..
మెగాస్టార్ చిరంజీవి నగ్మాతో పలు చిత్రాల్లో నటించారు. ఆమెతో కలిసి ఘరానా మొగుడు చేయగా.. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. తరువాత ఆమెతో ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు వంటి చిత్రాలను కూడా చిరంజీవి చేశారు. ఇక నగ్మా చెల్లెళ్లు రోషిణి, జ్యోతిక అన్న విషయం తెలిసిందే. చిరంజీవి రోషిణితో కలిసి మాస్టర్ అనే మూవీలో నటించారు. ఈ మూవీలో ఆయన కాలేజీ ప్రొఫెసర్‌గా అదరగొట్టేశారు. కాలేజీలో చెడ్డ దారిలో వెళ్తున్న విద్యార్థులను మంచి దారిలో నడిచేలా చేసి వారిని ప్రయోజకలుగా మార్చే మాస్టర్‌గా చిరంజీవి నటించారు. ఈ మూవీ కూడా హిట్ అయింది.
ఇక నగ్మా ఇంకో చెల్లెలు జ్యోతికతోనూ చిరు నటించారు. ఆమెతో చేసిన ఠాగూర్ సినిమా భారీ హిట్ అయింది. అవినీతి నాయకులు, అధికారుల భరతం పట్టే నికార్సయిన వ్యక్తిగా చిరంజీవి ఠాగూర్‌లో కనిపించారు. ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇలా చిరంజీవి ముగ్గురు అక్కాచెల్లెళ్లతోనూ నటించారు. ఇలా చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…