Anasuya : బుల్లితెరపై అత్యంత సక్సెస్‌ను సాధించిన షోలలో జబర్దస్త్ నంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తుందని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ షో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలోఈ షో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కమెడియన్లు రావడం, పోవడం ఈ షోకు సహజమే. కానీ ఇందులో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న కీలక కమెడియన్లు మాత్రం ఈ మధ్య దూరమయ్యారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో షో కళ తప్పిపోయింది.
జబర్దస్త్‌కు రోజా దూరమైనప్పటి నుంచి ఒక్కొక్కరుగా ఈ షోను వీడిపోతున్నారు. కారణాలు ఏమున్నప్పటికీ ఇతర టీవీ చానల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ.. రెమ్యునరేషన్ వంటి అంశాల వల్లే ఒక్కొక్కరు ఈ షోకు గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ షోకు మరో షాక్ తగిలింది. రంగమ్మత్తగా పేరుగాంచిన అనసూయ ఈ షోకు గుబ్ బై చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టే కారణమని చెప్పవచ్చు. ఇంతకీ అనసూయ అసలు ఏం పోస్ట్ చేసిందంటే..
తాను తన కెరీర్‌లోనే చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నానని అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలియజేసింది. ఎన్నో జ్ఞాపకాలను తన వెంట తీసుకువెళ్తున్నానని, అందులో కొన్ని తీపి జ్ఞాపకాలు ఉండగా.. కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయని తెలియజేసింది. తాను తన కెరీర్‌లో ఇంకా ముందుకు కొనసాగాలని చూస్తున్నానని, ఇప్పటి వరకు తనకు అందించిన ఆదరణను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని.. అనసూయ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిందని.. అందుకనే ఆ పోస్ట్ పెట్టి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…