Actor Krishna : న‌రేష్ ను మంద‌లించిన సూప‌ర్ స్టార్ కృష్ణ‌..? ప‌విత్ర‌తో వ్య‌వ‌హారంపై తీవ్ర అసంతృప్తి..?

Actor Krishna : గ‌త కొద్ది రోజులుగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల గురించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌తంలో వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వచ్చాయి. అయితే అవే నిజ‌మ‌య్యాయి. వీరిద్ద‌రూ న‌రేష్ భార్య రమ్య ర‌ఘుప‌తికి మైసూర్‌లోని ఓ హోట‌ల్‌లో ప‌ట్టుబ‌డ్డారు. త‌రువాత వీరు నిజం చెప్ప‌క త‌ప్ప‌లేదు. తాము స‌హ‌జీవ‌నం చేస్తున్నామ‌నే విష‌యాన్ని బ‌హిరంగంగానే అంగీక‌రించారు. దీంతో న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల‌పై ఉన్న గౌర‌వం కాస్తా పోయింది. గ‌తంలో వీరికి ఎంతో పేరు ఉండేది. ఆ ఒక్క సంఘ‌ట‌న‌తో పేరు మొత్తం పోగొట్టుకున్నారు. ప‌విత్ర‌ను అయితే రెండు సినిమాల నుంచి తొలగించారు.

ఇక ఈ వ్య‌వ‌హారంలో ముఖ్య పాత్ర అయిన ర‌మ్య ర‌ఘుప‌తి త‌న భ‌ర్త న‌రేష్‌పై న్యాయ పోరాటం చేస్తాన‌ని తెలియ‌జేసింది. త‌న‌ను గ‌న్‌తో బెదిరించి త‌న నుంచి విడాకులు తీసుకోవాల‌ని చూస్తున్నాడ‌ని.. కానీ ఆయ‌న‌పై న్యాయం కోసం పోరాడుతాన‌ని చెప్పింది. అయితే న‌రేష్ వ్య‌వ‌హారంపై కృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశార‌ట‌. ఆయ‌న అస‌లు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ న‌రేష్ వ‌ల్ల కృష్ణ పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న‌కు తెలిసే తాము ఇలా చేస్తున్నామ‌ని ప‌విత్ర లోకేష్ కూడా చెప్పింది. దీంతో కృష్ణ త‌న పేరు అలా బ‌య‌ట‌కు రావ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్నార‌ట‌. న‌రేష్‌ను ఈ విష‌య‌మై ఆయ‌న మంద‌లించార‌ట‌. అన‌వ‌స‌రంగా ఫ్యామిలీ పేరు చెడ‌గొడుతున్నావ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌.

Actor Krishna

ఓ కార్యక్ర‌మంలో భాగంగా కృష్ణ ఓ మీడియా సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధితో అనేక విష‌యాల‌ను చ‌ర్చించార‌ట‌. వాటిల్లో నరేష్ వ్య‌వ‌హారం కూడా ఒక‌టి ఉంద‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే న‌రేష్ ఇలా చేస్తాడ‌ని అనుకోలేద‌ని ఆయ‌న అన్నార‌ట‌. పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇవ్వ‌డం వ‌ర‌కు ఓకే. కానీ ఇలా స‌హ‌జీవ‌నం, ప్రేమ వ్య‌వ‌హారం అంటే కుటుంబం ప‌రువు మొత్తం పోతుంద‌ని ముందుగానే కృష్ణ భ‌య‌ప‌డ్డార‌ట‌. పెళ్లి చేసుకుని క‌ల‌సి ఉండాల‌ని చెప్పార‌ట కూడా. కానీ న‌రేష్ ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నార‌ట‌. దీంతో ఇప్పుడు జ‌ర‌గ‌రానిది జ‌రిగిపోయింది. ఫ్యామిలీ బండారం మొత్తం బ‌య‌ట ప‌డింది. ఇదే విష‌యంపై కృష్ణ అసంతృప్తితో ఉన్నార‌ట. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఇది మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చార‌మే. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM