గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Acharya Movie Review : ఆచార్య మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Acharya Movie Review : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ఆచార్య‌. నేడు ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయింది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన…

Acharya Movie Review : ఆచార్య మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Acharya Movie Review : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ఆచార్య‌. నేడు ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయింది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూడ‌గా.. ఆ క్ష‌ణం రానే వ‌చ్చింది. ఇప్పటికే యూఎస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడడంతో ఆచార్య రివ్యూలు వ‌చ్చేస్తున్నాయి. చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే..

Acharya Movie Review Chiranjeevi and Ram Charan
Acharya Movie Review

ధర్మస్థలి గురుకులం సంరక్షకుడిగా సిద్ధ‌ (రామ్‌ చరణ్‌) వ్యవహరిస్తూ ఉంటాడు. స్థానికులకు రక్షణగా ఉంటూ.. వారికి అండగా ఉంటాడు. అయితే ధర్మస్థలి పై బసవ(సోనూసూద్‌) కన్నుపడుతుంది. ధర్మస్థలిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అందుకు అడ్డుగా ఉన్న సిద్ధ‌ను తప్పించాలని భావిస్తాడు బసవ. అనూహ్య కారణాల వల్ల సిద్ధ‌ ధర్మస్థలిని వదిలేస్తాడు. ఆ స‌మ‌యంలో ధ‌ర్మ‌స్థ‌లి చిక్కుల్లో ప‌డుతుంది. అప్పుడు ఆచార్య వ‌చ్చి స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌బెడ‌తాడు. అసలు ఆచార్య‌కి, సిద్ధ‌కి సంబంధం ఏమిటి ? బ‌స‌వ‌రాజు నుండి ధ‌ర్మ‌స్థ‌లిని ఆచార్య ఎలా కాపాడాడు.. అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Acharya Movie Review : చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే..

మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సుదీర్ఘమైన నటనా అనుభవాన్ని ఆచార్య సినిమాలో కూడా చూపించారు. ఈ వయసులో కూడా డాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కనిపించిన తీరు నిజంగా అభినందనీయం. రామ్ చరణ్ పాత్ర పరిధి తక్కువగానే ఉన్నా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. తండ్రితో కలిసి నటించిన సన్నివేశాల్లో పోటీపడి మరీ నటించాడు అనిపించింది. ఇక పూజా హెగ్డె చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. సంగీత పాత్ర పరిమితంగా ఉన్నా ఆకట్టుకుంది. మొత్తంగా సినిమాలో కనిపించిన నటీ నటులు వారి వారి పాత్రల పరిధిల‌లో నటించారు.

సినిమాకు మణిశర్మ పాటలు, నేపథ్య‌ సంగీతం అంత‌గా ఇవ్వ‌లేక‌పోయారు. కొరటాల శివ ఆయన నుండి బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ను రాబట్టుకోలేక పోయారు. కొర‌టాల కాస్త పట్టు కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. కొరటాల శివ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. ఎడిటింగ్ విషయంలో చిన్న చిన్న తప్పులు ఉన్నా మొత్తంగా ఫ‌ర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఇక చిరు, చరణ్ ల మధ్య‌ ఉన్న సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని అందిస్తాయ‌నే చెప్పాలి. మొత్తంగా చూస్తే సీరియ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాల‌నుకునేవారు ఒక‌సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి