Today Gold Rate : బంగారం ధరల్లో గత కొంతకాలంగా భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి పెరగడం లేదా స్థిరంగా ఉండడం జరుగుతోంది. కొంతకాలం పాటు తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఇక సోమవారంతో పోలిస్తే బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ధరలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.
ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో ఈ ధరలు వరుసగా రూ.46,900, రూ.51,160గా ఉన్నాయి. అలాగే కోల్‌కతాలో రూ.46,900, రూ.51,160గా ఉన్నాయి. ముంబైలో, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
కాగా వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.61,100గా ఉంది. సోమవారంతో పోలిస్తే ఈ ధర రూ.100 తగ్గింది. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, విజయవాడల్లోనూ ఇదే ధర ఉండగా.. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో కిలో వెండి ధర రూ.54,900 పలుకుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అయితే కాస్త పరిస్థితులు మెరుగు పడగానే మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. కానీ స్థిరంగా ఉండడం లేదు. ఈ మధ్య కాలంలో ధరలు స్థిరంగా ఉంటుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…