వార్త‌లు & రాజ‌కీయాలు

Minister Nara Lokesh : బుర‌ద రాజ‌కీయాలకి జ‌గ‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్.. పాస్‌పోర్ట్ సమస్య లేకపోతే లండ‌న్ వెళ్లేవాడు..!

Minister Nara Lokesh : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నారా లోకేష్ మాజీ సీఎం జ‌గ‌న్‌ని ఇరుకున బెట్టే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు.చంద్రబాబు ఇంటిని రక్షించుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తారు అని జగన్ ఆరోపించడంతో పాటు వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అని జగన్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్​గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన జగన్, బెంగుళూరు ప్యాలస్​లో రిలాక్స్ అవుతున్నారని మండిపడ్డారు. 74 ఏళ్ల వయస్సులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చెయ్యడానికి మనస్సు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర లేకపోగా, ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందేనని విమర్శించారు. నాడు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు 464 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభిస్తే వైఎస్సార్సీపీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారని దుయ్యబట్టారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు. ఆధునీకరణ, మరమ్మతుల పనులు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్.ఆధునీకరణ, మరమ్మతు పనులు ఆపేశారు. సుమారుగా రూ. 500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసీపీ నాయకులు కబ్జా చేశారని లోకేశ్ ఆరోపించారు.

Minister Nara Lokesh

విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారని మండిపడ్డారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు అని లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు . అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం అని తమ పాలనలో ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశారు లోకేష్.విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వరద సహాయ చర్యలపై మంత్రి నారాయణ, కలెక్టర్ సృజనతో నారా లోకేశ్ సమీక్షించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM