Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం ప్రకారం.. ఇంకా జరగాల్సినవి ఇవి..!

July 25, 2023 8:46 AM

Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు గతంలో చాలా జరిగాయి. వాటి గురించి మనం విన్నాం కూడా. ఆయన మాటలు ఎన్నో నిజమయ్యాయి. పైగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూశాము. ఆయన చాలా చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఇక ఇంకా జరగాల్సినవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకు పోతాయని ఆయన చెప్పారు. అదే విధంగా కృష్ణా నది మధ్యలో బంగారు రథం ఉంటుందని అది చూసిన వాళ్ళ కళ్ళు పోతాయని చెప్పారు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి వారు.

pothuluri veerabrahmendra swamy Kalagnanam to be happen
Kalagnanam

యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది. బనగానపల్లెలో పాతరం మీది చింత చెట్టుకి బూజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలని చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగి పోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు.

అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహా లక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ ధాకి దక్షిణాన జనాలు మరణిస్తారు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ఇవి ఇంకా జరగాల్సి వున్నవి. మరి ఇంకా వీటిలో ఎప్పుడు ఏవి నిజమవుతాయి అనేది చూద్దాం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment