Bheema And Bakasura : పాండవులు ఓ రోజు వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ గ్రామస్తులు పాండవులకి ఆశ్రయం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడికి పిల్లలు కూడా వున్నారు. కొన్ని రోజులు అంతా ఆనందంగా ఉన్నారు. ఒక రోజు తల్లి కుంతి బ్రాహ్మణుడు ఇంటి నుండి వస్తున్న ఏడుపుని వింటుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళింది. అయితే బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయడం తన బాధ్యత అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. కుంతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రశాంతంగా వివరించాలని బ్రాహ్మణుడిని ఆమె కోరింది.
అప్పుడు అతను బకాసురుడి కథని చెప్పాడు. ప్రతిరోజు ఒక అతను బండితో ఆహారం తీసుకుని రాక్షసుడు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు రాక్షసుడు ఆ గ్రామస్తుడిని, ఆ ఆహారాన్ని కూడా తింటూ ఉంటాడు. ఆ విధంగా రాక్షసుడు చాలా మందిని ఇప్పటికే చంపేశాడట. ఈరోజు వారి కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారం తీసుకుని వెళ్లాలి. రాక్షసుడికి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పారు బ్రాహ్మణుడు. అది విన్న కుంతి నా కుమారుడు భీముడు మీకు సహాయం చేయగలడు అని చెప్పింది. నా కుమారుడు వెళ్తాడని ఆమె చెప్పింది.
మీ కొడుకు చనిపోవడానికి నేను ఒప్పుకోను అని బ్రాహ్మణ స్త్రీ అంటుంది. భయపడవద్దు నా కొడుకు భీముడు ఇది వరకు కూడా రాక్షసుణ్ణి చంపాడని, సురక్షితంగా అతను తిరిగి వస్తాడని చెప్పింది. బియ్యం, పాలు, పండ్లు వంటివి అన్నీ కూడా భీముడు తీసుకువెళ్తాడు. అక్కడ బకాసురుడు కనపడలేదు. ఒక చెట్టు నీడలో కూర్చుంటాడు. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. అరటి పండ్లను తినడం మొదలుపెట్టాడు. అరటి పండ్లు అయిపోయాయి. బియ్యం, పండ్లు, మిఠాయిలు అన్ని కూడా తినేస్తాడు. తెచ్చిన ఆహారాన్ని అంతటినీ కూడా భీముడు తినేస్తూ ఉంటాడు.
రాక్షసుడు భీకరంగా ఉన్నాడు. ఖాళీ బండిని చూసి కోపం వచ్చింది. భీముడు పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. నా ఆహారాన్ని తినడానికి నీకు ఎంత ధైర్యం అని అడిగాడు రాక్షసుడు. భీముడు నవ్వుతూ నేను ఆకలితో ఉన్నాను. నువ్వు ఆలస్యంగా వచ్చావు.. అంటాడు. ఇక వీళ్ళ మధ్య యుద్ధం మొదలైంది. పోరాటంలో భీముడు బకాసురుడుని చంపేశాడు. బకాసురుడిని ఒక తాడుతో బండికి కడతాడు. గ్రామం అంతా తిప్పుతాడు. గ్రామస్తులు రాక్షసుడు చనిపోయాడని తెలుసుకుంటారు. మొదట నమ్మలేరు. వాళ్ల కన్నీటితో భీముడికి కృతజ్ఞతలు చెబుతారు. ఇలా భీముడు, బకాసురుడి కథ ఎంతో ఆసక్తిగా సాగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…