Over Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినన్ని గంటల పాటు నిద్ర పోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా సరే నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం నిర్దేశించిన గంటల సమయం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి వారు నిత్యం 9 గంటలకు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
చైనాలోని వుహాన్‌లో ఉన్న హువాజ్‌హాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు 6 ఏళ్ల పాటు 31,750 మందిని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికున్న ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానం, నిద్రించే సమయం, వారికున్న వ్యాధులు తదితర అనేక అంశాలను సేకరించి చివరకు ఆ సమాచారం మొత్తాన్ని విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే నిత్యం 9 గంటల కన్నా ఎక్కువగా నిద్రించే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 23 శాతం ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
అలాగే నిత్యం పగటి పూట 90 నిమిషాల కన్నా ఎక్కువ సేపు నిద్రించే వారికి ఆ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 25 శాతం ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. కనుక నిత్యం తగినన్ని గంటలపాటు మాత్రమే నిద్రించాలని వారు సూచిస్తున్నారు. ఇక ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…