lifestyle

Vakkayalu : ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే ఈ కాయ‌లు.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తినండి..!

Vakkayalu : ఇప్పుడు చాలా మంది ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే జీవిస్తున్నారు క‌నుక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పండ్ల గురించి చాలా మందికి పూర్తిగా తెలియ‌దు. అనేక ర‌కాల పండ్ల‌ను చాలా మంది చూసి ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ల‌భించే కొన్ని ర‌కాల పండ్ల‌ను ఇప్ప‌టికీ చాలా మంది చూసి ఉండ‌రు. అలాంటి పండ్ల‌లో వాక్కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి పండినా కూడా వీటిని వాక్కాయ‌ల‌నే పిలుస్తారు. ఇక వాక్కాయ‌ల గురించి అడిగితే మ‌న పెద్ద‌లు చ‌క్క‌గా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువ పండుతాయి. ఈ కాయ‌లు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. కొంద‌రు ప‌చ్చిగా ఉన్న ఈ కాయ‌ల‌ను తీసుకుని ప‌చ్చ‌డి పెట్టుకుంటారు. ఇక ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాక్కాయ‌ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా ఈ కాయ‌ల‌ను తింటే గ్యాస్‌, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం ఉండ‌వు. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం కూడా త‌గ్గుతుంది. ఈ కాయ‌ల‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, ఫైబ‌ర్‌, ఫైటో న్యూట్రియెంట్స్‌, ఆంథోస‌య‌నిన్స్‌, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ కాయ‌ల‌ను తింటే క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా చూసుకోవ‌చ్చు. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఈ కాయ‌ల‌ను తింటే కిడ్నీల్లోని రాళ్లు సైతం క‌రిగిపోతాయి.

Vakkayalu

ఇక ఇవి రుచికి పులుపుగా, వ‌గ‌రుగా ఉంటాయి. కానీ వీటిని తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ కాయ‌ల‌ను తిడం వ‌ల్ల విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ కాయ‌ల్లో అద్భుత‌మైన యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ కాయ‌ల‌ను తింటే రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ వ్యాధులు సైతం త‌గ్గిపోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

దంతాలు, చిగుళ్ల నుంచి ర‌క్తం కారే స‌మ‌స్య ఉన్న‌వారు వాక్కాయ‌ల‌ను తిన‌డం మంచిది. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ కాయ‌ల‌ను తింటే మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. దీంతో మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. అలాగే దంతాలు పుచ్చిపోకుండా ఇవి ర‌క్షిస్తాయి. వాక్కాయాల‌ను తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తుతుల శుభ్ర‌మ‌వుతాయి. దీంతో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సెర‌టోనిన్ అనే హార్మోన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అంటారు. అందువ‌ల్ల వాక్కాయ‌ల‌ను తింటే మ‌న మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి రాత్రిపూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

ఇలా వాక్కాయల‌ను తిన‌డం వ‌ల్ల మనం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఇవి కొంద‌రికి అల‌ర్జీల‌ను క‌ల‌గ‌జేస్తాయి. వీటిని తింటే చ‌ర్మంపై దుర‌ద‌లు, దద్దుర్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. కొంద‌రికి పొట్ట‌లో అసౌక‌ర్యం కూడా ఏర్ప‌డ‌వ‌చ్చు. క‌నుక వీటిని తినేముందు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ముఖ్యం. అల‌ర్జీలు ఉన్న‌వారు ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM