Tea Powder : మీరు వాడుతున్న టీ పొడి క‌ల్తీ అయిందా లేదా ఇలా గుర్తించండి..!

February 5, 2024 7:54 PM

Tea Powder : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..

1. కొన్ని తేయాకులను తీసుకుని ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్‌పై వేసి నీళ్లు చల్లాలి. అనంతరం ఆకులను తీసేసి ఆ పేపర్‌ను ట్యాప్ వాటర్‌తో కడగాలి. పేపర్‌పై ఎలాంటి మరకలు పడకపోతే ఆ తేయాకులు కల్తీ జరగలేదని గుర్తించాలి. అదే కల్తీ జరిగితే పేపర్‌పై కోల్ తార్ మరకలు కనిపిస్తాయి.

Tea Powder how to know it is adulterated or what
Tea Powder

2. టీ పొడి లేదా ఆకులను ఒక గ్లాస్ ప్లేట్‌పై వేసి వాటిపై అయస్కాంతం ఉంచాలి. ఒక వేళ ఆ పొడి లేదా ఆకుల్లో ఐరన్ ఉంటే వెంటనే అయస్కాంతానికి ఆ ఐరన్ అంటుకుంటుంది. దీంతో ఆ టీ పొడి కల్తీ జరిగిందని గుర్తించాలి.

3. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో టీ పొడి లేదా తేయాకులు కొన్నింటిని వేయాలి. అవి కల్తీవైతే నీళ్ల రంగు మారుతుంది. అసలువైతే నీళ్లు అలాగే ఉంటాయి. రంగు మారవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now