Young Skin : వీటిని రోజూ తింటే చాలు.. ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా ఉంటారు, వృద్ధాప్యం రాదు..!

March 12, 2024 5:04 PM

Young Skin : వయస్సు మీద పడుతుందంటే చాలు.. ఎవరికైనా స‌రే.. సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. దీంతో కొంద‌రు దిగులు చెందుతుంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే.. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపిస్తుంటాయి. అయినప్పటికీ కొందరికి మాత్రం అలా ఉండడం నచ్చదు. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. అలాగే చ‌ర్మంపై ముడ‌త‌లు కూడా పడ‌కుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉండేలా చూస్తాయి. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. నిత్యం పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. బాదంపప్పులో ఉండే విటమిన్‌ ఇ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలు ఏర్పడకుండా చూస్తుంది. నిత్యం బాదంపప్పులను తినడం లేదా బాదంనూనెను వాడడం ద్వారా చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతో చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి.

take these foods daily to keep Young Skin
Young Skin

బొప్పాయి పండ్లు మన చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం చర్మాన్ని ఎప్పుడూ మృదువుగా ఉంచుతుంది. చర్మంలో తేమను పెంచుతుంది. దీంతో చర్మం ఎండిపోకుండా ఉంటుంది. అలాగే బొప్పాయి పండును మాస్క్‌లా వేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. బొప్పాయి పండును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. ఎరుపు క్యాప్సికంలో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ క్యాప్సికాన్ని నిత్యం తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. దీంతో ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

టమాటాల్లో ఉండే లైకోపీన్‌ చర్మాన్ని సంరక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చూస్తుంది. దీంతో చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now