Strong Bones : ఈ మూడింటినీ రోజూ తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

February 3, 2024 5:20 PM

Strong Bones : నిత్యం మనం అనేక పనులను సజావుగా చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. అయితే శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం. ఎముకలు విరిగినా, నొప్పి కలిగినా మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఏ పనీ చేయలేం. కనుక ప్రతి ఒక్కరు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. మరి ఆ పోషకాలు ఏమిటంటే..

మన ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరమని అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చాలా మంది తమ పాఠ్యపుస్తకాల్లో కాల్షియం గురించి చదువుకుంటూ వస్తుంటారు. అందువల్ల కాల్షియం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏ వయస్సులోనైనా సరే ఎముకలు దృఢంగా ఉండాలంటే నిత్యం కాల్షియం ఉన్న పదార్థాలను తీసుకోవాలి. కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లగా మారుతాయి. త్వరగా విరిగే అవకాశం ఉంటుంది. కనుక కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు, పాలు, చీజ్, పాలకూర తదితర ఆహారాలను నిత్యం తీసుకుంటే కాల్షియం లోపం రాకుండా, ముందు చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

take these foods daily strong bones
Strong Bones

సూర్యరశ్మి వల్ల మనకు విటమిన్ డి లభిస్తుందని అందరికీ తెలుసు. సూర్యకాంతిలో మన శరీరాన్ని ఉంచితే చర్మం కింది భాగంలో ఉండే పలు రసాయనాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. ఈ క్రమంలో తయారయ్యే విటమిన్ డి మన ఎముకలను దృఢంగా చేస్తుంది. విటమిన్ డిని మనం చేపలు, పాలు, కోడిగుడ్లు, పుట్టగొడుగుల ద్వారా కూడా పొందవచ్చు. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక నిత్యం విటమిన్ డి తగినంత లభించేలా చూసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

విటమిన్ కె అనేది కేవలం రక్తం గడ్డకట్టేందుకే కాదు, ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. విటమిన్ కె ఉండడం వల్ల రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలో ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా ఎముకలు దృఢంగా మారాలన్నా విటమిన్ కె ఎక్కువగా ఉండే పాలకూర, బ్రొకొలి, కివీ పండ్లు, పెరుగు, అవకాడోలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now