Broken Bones : ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కోవాలంటే.. వీటిని రోజూ తినండి..!

February 11, 2024 7:58 PM

Broken Bones : ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనుకోకుండా కింద పడినప్పుడు సహజంగానే ఎవరికైనా ఎముకలు విరుగుతుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. అయితే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ.. ఎముకలు త్వరగా అతుక్కోవాలన్నా, వాటికి మళ్లీ బలం కలగాలన్నా.. కింద తెలిపిన పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే అందుకు కాల్షియం కావాలి. కనుక కాల్షియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనకు కాల్షియం పాలు, పెరుగు, గుడ్లు, పాలకూర, సోయా మిల్క్, బ్రెడ్, తృణ ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల కాల్షియం సరిగ్గా అందుతుంది. ఫలితంగా ఎముకలు త్వరగా అతుక్కుని బలంగా మారుతాయి.

మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను మన శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు విటమిన్ సి కావాల్సిందే. కనుక విటమిన్ సి ఉండే.. నిమ్మ, నారింజ, పైనాపిల్, కివీలు, క్యాప్సికం, టమాటాలు, ఉసిరి తదితర పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సి ఉంటుంది. దీంతో కాల్షియాన్ని శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది. కాల్షియం శోషణకు విటమిన్ డి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే చేపలు, గుడ్లు, పాలు, పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.

take these foods daily for Broken Bones
Broken Bones

ఆకుపచ్చని కూరగాయాల్లో విటమిన్ కె పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఎముకలు అతుక్కునేందుకు, ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయ పడుతుంది. విరిగిన ఎముకలు మళ్లీ నిర్మాణం అయ్యేందుకు మెగ్నిషియం ఎంతగానో సహాయ పడుతుంది. మెగ్నిషియం అధికంగా ఉండే క్వినోవా, రైస్ బ్రాన్, పాలకూర, బాదంపప్పు, జీడిపప్పు, గుమ్మడికాయ విత్తనాలను నిత్యం అధికంగా తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now