Chaddannam : ఇప్పుడంటే మనం మన పెద్దల అలవాట్లను పునికి పుచ్చుకోలేదు కానీ.. నిజంగా వారి అలవాట్లను మనం కూడా పాటిస్తే మన ఆరోగ్యాలు చాలా బాగుండేవి. అవును మరి. ఎందుకంటే.. మన పెద్దలు ఒకప్పుడు అలాంటి తిండి తినేవారు మరి.. వారి జీవన విధానం వల్ల వారు ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. అయితే మన పెద్దల ఆహారపు అలవాట్లలో ముఖ్యమైంది.. ఉదయాన్నే చద్దన్నం తినడం. అందులో కొద్దిగా పెరుగు వేసుకుని మిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకుని మన పెద్దలు తినేవారు. అయితే ఇలా ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే పెరుగులో ఉండే కాల్షియం మన శరీరానికి సరిగ్గా అందుతుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండాకాలం ఉదయాన్నే చద్దన్నం, పెరుగు తింటే రోజంతా ఎండలో తిరిగినా శక్తి నశించకుండా ఉంటుంది. ఎండ దెబ్బ తాకకుండా ఉంటుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేస్తారు.
హైబీపీ, నీరసం, మలబద్దకం సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటుంటే ఫలితం ఉంటుంది. అల్సర్లు ఉన్నవారు, జీర్ణాశయం, పేగుల సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే ఆయా అవయవాలకు బలం కలుగుతుంది. వాటిల్లో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…