lifestyle

Milk Adulteration Tips : మీరు రోజూ తాగుతున్న పాలు అస‌లువేనా.. క‌ల్తీ జ‌రిగిన‌వా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Milk Adulteration Tips : ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా క‌ల్తీ చేయ‌బ‌డిన ఆహార ప‌దార్థాలే మ‌న‌కు విక్ర‌యిస్తున్నారు. దీంతో క‌ల్తీల‌ను గుర్తించ‌డం మ‌న‌కు క‌ష్ట‌త‌ర‌వ‌మ‌వుతోంది. ఇక బాగా క‌ల్తీ అవుతున్న ఆహార ప‌దార్థాల జాబితాలో పాలు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు నిత్యం అవ‌స‌రం కాబ‌ట్టి వీటికి డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. దీంతో పాల‌ను చాలా మంది క‌ల్తీ చేసి విక్ర‌యిస్తుంటారు. అయితే కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే మీరు వాడే పాలు క‌ల్తీ అయ్యాయో, కాలేదో.. ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే..

పాల‌ను స‌న్న‌ని మంట మీద సుమారుగా 2 నుంచి 3 గంట‌ల పాటు వేడి చేస్తే కోవాలాంటి ప‌దార్థం ఏర్ప‌డుతుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ కోవా జిడ్డుగా, నూనె త‌ర‌హాలో ఉంటే అప్పుడు ఆ పాలు మంచివేనన్న‌మాట‌. అలా కాకుండా గ‌ట్టి ప‌దార్థంగా కోవా ఏర్ప‌డితే ఆ పాలు కల్తీ అయ్యాయ‌ని గుర్తించాలి. సాధార‌ణంగా పాల‌ను క‌ల్తీ చేయాల‌నుకువారు వాటిల్లో ఎక్కువ‌గా కెమిక‌ల్స్ క‌లుపుతారు. అయితే అలా కెమిక‌ల్స్ క‌ల‌ప‌బ‌డిన పాల‌ను వేడి చేస్తే అవి త్వ‌ర‌గా ప‌సుపు ప‌చ్చ రంగులోకి మారుతాయి. అలా మారితే ఆ పాలు క‌ల్తీవ‌న్న‌మాట‌. ఇక క‌ల్తీ జ‌రిగిన పాల‌ను చేతిలో వేసుకుని రుద్దితే స‌బ్బు నుంచి నుర‌గ వ‌చ్చిన‌ట్లు వ‌స్తుంది. దీంతో ఆ పాల‌ను క‌ల్తీ పాల‌ని గుర్తించాలి.

Milk Adulteration Tips

పాల‌లో నీళ్లు క‌లిపారా లేదా అన్న విష‌యం తెలుసుకోవాలంటే.. చేతి పిడికిలిపై ఒక పాల చుక్క వేయాలి. అనంత‌రం ఆ చుక్క‌ను కింద‌కు ప్ర‌వ‌హించేట్లు చేయాలి. ఈ క్ర‌మంలో ఆ చుక్క వెంబ‌డి నీరు లాంటి ప‌దార్థం కనిపిస్తే ఆ పాల‌లో నీటిని క‌లిపిన‌ట్లే లెక్క‌. అలా కాక‌పోతే పాల చుక్క కింద‌కు ప్ర‌వ‌హించే క్ర‌మంలో దాని వెనుక ఎలాంటి నీటి లాంటి ప‌దార్థం మ‌న‌కు క‌నిపించ‌దు. అలాంటి పాలను చిక్క‌టి పాల‌ని గుర్తించాలి.

కొంద‌రు పాల‌ను క‌ల్తీ చేసేందుకు అందులో వ‌న‌స్ప‌తి లేదా డాల్డా క‌లుపుతుంటారు. నిజానికి అవి మ‌న శ‌రీరానికి ఎంత మాత్రం ఆరోగ్య‌క‌రం కాదు. ఈ క్ర‌మంలో మీరు వాడే పాల‌లో వ‌న‌స్ప‌తి లేదా డాల్డా క‌ల‌ప‌బ‌డింద‌ని నిర్దారించుకునేందుకు ఆ పాల‌ను 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, 1 టేబుల్ స్పూన్ చ‌క్కెర క‌లిపి చూడాలి. ఆ త‌రువాత ఆ మిశ్ర‌మం ఎరుపు రంగులోకి మారితే క‌చ్చితంగా ఆ పాలు క‌ల్తీ అయ్యాయ‌ని గుర్తించాలి.

పాల‌లో కొంద‌రు పిండి క‌లిపి వాటిని క‌ల్తీ చేస్తుంటారు. దాన్ని గుర్తించేందుకు 5 ఎంఎల్ మోతాదులో పాలు తీసుకుని వాటిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు (అయోడిన్ ఉన్న‌ది) వేసి క‌లపాలి. ఈ క్ర‌మంలో ఆ మిశ్ర‌మం నీలి రంగులోకి మారితే ఆ పాలు కల్తీ అయ్యాయ‌ని తెలుసుకోవాలి. ఆహార ప‌దార్థాల‌ను నిల్వ చేసేందుకు చాలా మంది ఫార్మాలిన్ అనే ర‌సాయనాన్ని క‌లుపుతుంటారు. అయితే పాల‌లో ఈ కెమిక‌ల్ ఉందో, లేదో నిర్దారించేందుకు పాల‌ను 10 ఎంఎంల్ మోతాదులో తీసుకుని వాటిలో 2-3 చుక్క‌ల స‌ల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. ఈ ప్ర‌యోగాన్ని టెస్ట్ ట్యూబ్‌లో చేయాలి. ఈ క్ర‌మంలో టెస్ట్ ట్యూబ్ పైభాగంలో నీలి రంగు రింగ్ క‌నిపిస్తుంది. అది క‌నిపించిందంటే.. ఆ పాల‌లో ఫార్మాలిన్ క‌ల‌ప‌బ‌డింద‌ని తెలుసుకోవాలి.

ఇక చివ‌రిగా మ‌రొక సూచ‌న‌.. సాధార‌ణంగా చాలా మంది క‌ల్తీ చేసేవారు.. పాల‌ను క‌ల్తీ చేసేందుకు ఎక్కువగా యూరియా వాడుతుంటారు. ఎందుకంటే పాల‌లో యూరియా క‌లిపితే మ‌న‌కు స‌రిగ్గా తెలియ‌దు. పాల రుచి కూడా మార‌దు. అందువ‌ల్ల పాల‌లో యూరియా క‌ల‌ప‌బ‌డింద‌ని తెలుసుకోవ‌డం కూడా మ‌న‌కు క‌ష్ట‌మే అవుతుంది. అయితే అలాంట‌ప్పుడు అర టేబుల్ స్పూన్ పాల‌లో సోయాబీన్ పౌడ‌ర్‌ను బాగా క‌లిపి 5 నిమిషాల త‌రువాత లిట్మ‌స్ పేప‌ర్ తీసుకుని ఆ మిశ్ర‌మంలో ఆ పేప‌ర్‌ను 30 సెక‌న్ల పాటు ముంచాలి. దీంతో లిట్మ‌స్ పేప‌ర్ రంగు ఎరుపు నుంచి నీలి రంగుకు మారుతుంది. అలా గ‌న‌క జ‌రిగితే పాల‌లో క‌చ్చితంగా యూరియా క‌ల‌ప‌బ‌డింద‌ని తెలుసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM