Late Dinner Side Effects : రోజూ మనకు అన్ని పోషకాలతో కూడిన ఆహారం ఎంత అవసరమో.. ఆ ఆహారాన్ని టైముకు తీసుకోవడం కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది టైముకు భోజనం చేయడం లేదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడు పూటలా లేటుగానే ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే కొందరు ఉదయం, మధ్యాహ్నం టైముకే తిన్నా రాత్రి మాత్రం ఆలస్యం చేస్తుంటారు. రాత్రి 9 గంటల తరువాతనే భోజనం చేస్తున్నారు. కానీ దీని వల్ల ఎంతో అనర్థం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేస్తే అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల దాని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడుతుంది. ఆ సమయంలో జీర్ణ వ్యవస్థకు రెస్ట్ ఇవ్వాలి. కానీ అప్పుడే భోజనం చేయడం వల్ల ఆ వ్యవస్థపై భారం పడుతుంది. దీంతో అర్థరాత్రి లేదా తెల్లవారు జాము వరకు జీర్ణవ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే రాత్రి పూట లివర్, కిడ్నీలకు కూడా రెస్ట్ ఉండదు. అవి కూడా ఆ సమయంలో పనిచేస్తాయి. దీంతో వాటి పనితీరు కూడా మందగిస్తుంది.
ఇక రాత్రి పూట 9 గంటల తరువాత భోజనం చేయడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు చేరుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. దీంతోపాటు కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీలు అతిగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు.
ఇలా రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఇన్ని అనర్థాలు కలుగుతాయి కాబట్టే రాత్రి వీలైనంత త్వరగా భోజనం చేసేయాలి. రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే అన్ని అవయవాలకు రెస్ట్ లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక రాత్రి వీలైనంత తక్కువగా తింటే ఇంకా మంచిది. దీంతో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…