Baingan Pulao : వంకాయలను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వంకాయ టమాటా, వంకాయ కుర్మా, పచ్చడి, పెరుగు పచ్చడి.. ఇలా రక రకాల వంటకాలను మనం వంకాయలతో చేయవచ్చు. వంకాయలతో చేసే ఈ కూర అయినా లేదా పచ్చడి అయినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే వంకాయలతో ఎంతో రుచిగా ఉండే బైంగన్ పులావ్‌ను కూడా చేయవచ్చు. దీన్ని కొన్ని నిమిషాల్లోనే వండవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు. చాలా త్వరగా రెడీ అవుతుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇక బైంగన్ పులావ్‌ను ఎలా చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాస్మతి బియ్యం – 2 కప్పులు (అర గంట ముందు నానబెట్టుకోవాలి), వంకాయలు – 10, దాల్చిన చెక్క – చిన్న ముక్క, యాలకులు – 4, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీస్పూన్, నూనె – పావు కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – 2, బిర్యానీ ఆకు – 1, టమాటాలు – 2, పసుపు – అర టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, గరం మసాలా – 1 టీస్పూన్, బిర్యానీ మసాలా – 1 టీస్పూన్, కారం – 1 పెద్ద టీస్పూన్, పెరుగు – అర కప్పు.
వేయించిన పల్లీలు – పావు కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – అర టీస్పూన్, కారం – 1 టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్.
మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలు, తగినంత ఉప్పు మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాట్లు పెట్టుకున్న వంకాయల్లో కూరాలి. స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి కరిగాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పెరుగు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నీ ఉడికాక వంకాయలు, కడిగిన బియ్యం, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి బైంగన్ పులావ్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా కూర, రైతాతోనూ లాగించేయవచ్చు. ఎంతో ఇష్టంగా తింటారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…