Akira Nandan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కు పండగే. ఇక నిర్మాతలు కూడా డేట్స్ ఇవ్వకపోయినా పవన్‌కు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి లైన్‌లో ఉంటారు. దీంతో తరువాతి సినిమాకు ఆయన కన్‌ఫామ్ చేస్తారని నమ్మకం. అంతలా పవన్‌కు పేరుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయినా సరే ఇండస్ట్రీలో కేవలం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలదు, కాస్త లక్ ఉండాలి. అలాగే యాక్టింగ్, డ్యాన్స్ వంటి అంశాల్లోనూ రాణించాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలబడతారు. అయితే ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తయితే ఇకపై జరగబోయేది ఒకెత్తు అని తెలుస్తోంది. అవును, ఎందుకంటే.. ఇప్పటి వరకు పవన్ ప్రేక్షకులను అలరించారు. కానీ ఇకపై ఆయన తనయుడు అకీరా నందన్ సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించనున్నాడని తెలుస్తోంది.
అకీరానందన్ ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నాడు. మరో 2 లేదా 3 ఏళ్లు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే చదువు పూర్తయ్యాక అకీరాను సినిమాల్లోకి తీసుకురావాలని రేణు దేశాయ్ ఆలోచిస్తున్నదట. అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఇక పవన్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన బద్రి సినిమానే రీమేక్ చేయాలని, దాంతోనే అకీరాను టాలీవుడ్‌కు పరిచయం చేయాలని రేణు దేశాయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బద్రి సినిమా అప్పట్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చింది. అందులో రేణు దేశాయ్ ఒక హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలోనే పవన్, రేణులు ప్రేమలో పడగా తరువాత కొంతకాలం సహజీవనం చేశారు. పిల్లలు పుట్టాక ఎప్పటికో వివాహం చేసుకున్నారు. తరువాత రేణుకు విడాకులు ఇచ్చిన పవన్ రష్యాకు చెందిన అన్నా లెజినివాను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రస్తుతం రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…