Akira Nandan : అకీరా నందన్ వ‌చ్చేస్తున్నాడు..? సినిమాల్లో ఎంట్రీ క‌న్‌ఫామ్‌..? పేరు ఇదే..?

May 11, 2024 8:08 PM

Akira Nandan : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎంత పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కు పండ‌గే. ఇక నిర్మాత‌లు కూడా డేట్స్ ఇవ్వ‌క‌పోయినా ప‌వ‌న్‌కు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి లైన్‌లో ఉంటారు. దీంతో త‌రువాతి సినిమాకు ఆయ‌న క‌న్‌ఫామ్ చేస్తార‌ని న‌మ్మ‌కం. అంత‌లా ప‌వ‌న్‌కు పేరుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు అయినా స‌రే ఇండ‌స్ట్రీలో కేవ‌లం ఫ్యామిలీ స‌పోర్ట్ ఉంటే చాల‌దు, కాస్త ల‌క్ ఉండాలి. అలాగే యాక్టింగ్‌, డ్యాన్స్ వంటి అంశాల్లోనూ రాణించాలి. అప్పుడే ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ‌తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒకెత్త‌యితే ఇక‌పై జ‌ర‌గ‌బోయేది ఒకెత్తు అని తెలుస్తోంది. అవును, ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. కానీ ఇక‌పై ఆయ‌న త‌న‌యుడు అకీరా నంద‌న్ సినిమాల ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.

అకీరానంద‌న్ ప్ర‌స్తుతం విద్యాభ్యాసం చేస్తున్నాడు. మ‌రో 2 లేదా 3 ఏళ్లు ప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అయితే చ‌దువు పూర్త‌య్యాక అకీరాను సినిమాల్లోకి తీసుకురావాల‌ని రేణు దేశాయ్ ఆలోచిస్తున్న‌ద‌ట‌. అందుకు అనుగుణంగానే ఇప్ప‌టి నుంచే ఆమె ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌ని తెలుస్తోంది. ఇక ప‌వ‌న్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందించిన బ‌ద్రి సినిమానే రీమేక్ చేయాల‌ని, దాంతోనే అకీరాను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయాల‌ని రేణు దేశాయ్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Akira Nandan reportedly coming to movies
Akira Nandan

బ‌ద్రి సినిమా అప్ప‌ట్లో పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చింది. అందులో రేణు దేశాయ్ ఒక హీరోయిన్‌గా న‌టించింది. ఆ స‌మ‌యంలోనే ప‌వ‌న్‌, రేణులు ప్రేమ‌లో ప‌డ‌గా త‌రువాత కొంత‌కాలం స‌హ‌జీవ‌నం చేశారు. పిల్ల‌లు పుట్టాక ఎప్ప‌టికో వివాహం చేసుకున్నారు. త‌రువాత రేణుకు విడాకులు ఇచ్చిన ప‌వ‌న్ ర‌ష్యాకు చెందిన అన్నా లెజినివాను వివాహం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ప్ర‌స్తుతం రెండు ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణం చేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన, టీడీపీ కూట‌మి విజ‌యం సాధిస్తుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now