Faluda : మండుతున్న ఎండలకు చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. చాలా మంది చల్లని పానీయాలను తాగుతుంటారు. వాటిల్లో ఫలూదా కూడా ఒకటి. బయట మనకు బండ్లపై ఇది ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే చాలు.. బయట బండ్లపై ఇచ్చేలాంటి రుచితో ఫలూదాను ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా తయారు చేయవచ్చు. ఇక ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు – 2 కప్పులు, స్ట్రాబెర్రీ జామ్ – అర కప్పు, రోజ్ సిరప్ లేదా రూ అఫ్జా – 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జా గింజలు, ఉడికించిన సేమ్యా – 1/3 కప్పు, పిస్తా, బాదం పప్పు తురుము – 2 టీస్పూన్ల చొప్పున, వెనిల్లా ఐస్ క్రీమ్ – 4 టీస్పూన్లు, చక్కెర – రుచికి సరిపడా.
ఫలూదా తయారీకి 2 గంటల ముందుగా జామ్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ఉంచుకోవాలి. తరువాత పాలను స్టవ్ మీద పెట్టి ఒకటిన్నర కప్పు అయ్యే వరకు మరిగించి చల్లార్చాలి. ఆ తరువాత చక్కెర, 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ లేదా రూఅఫ్జా కలిపి పాలను బాగా గిలకొట్టి ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత గ్లాసులు తీసుకుని మొదట రోజ్ సిరప్ లేదా రూఅఫ్జా వేసి ఆపైన జామ్‌ను కొద్దిగా చిదిమి వెయ్యాలి. ఆ తరువాత సేమ్యా, సబ్జా గింజలు వేసి గ్లాసుల్లో మూడొంతుల వరకు పాలు పోయాలి. చివరగా పైన ఐస్‌క్రీమ్, పిస్తాం, బాదం తురుము వేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఫలూదా రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…