Cool Drinks : వేసవి కాలంలో చల్ల చల్లగా ఉంటాయని చెప్పి కొందరు కూల్ డ్రింక్స్‌ను అదే పనిగా తాగుతుంటారు. ఇక కొందరు కాలాలతో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్‌ను ఎడా పెడా తాగుతుంటారు. నిజానికి అలా తాగడం ఒక హాబీ అని కొందరు అనుకుంటారు. ఇంకా కొందరు వాటిని తాగితే దాహం తీరి రిలాక్స్ అవుతామని అనుకుంటారు. కానీ అసలు కూల్ డ్రింక్స్ గురించిన నిజం తెలిస్తే వాటిని ఎవరైనా సరే.. ఇక జన్మలో తాగరు.. మరి ఆ నిజం ఏమిటో తెలుసా..
కూల్ డ్రింక్స్‌లో ఫాస్ఫారిక్ యాసిడ్ అనే ఓ క్రిస్టలైన్ లిక్విడ్ ఉంటుంది. నిజానికి ఇది కూల్ డ్రింక్‌కు యాసిడ్ ఫ్లేవర్‌ను ఇస్తుంది. అయితే ఇదే రసాయనాన్ని టాయిలెట్ క్లీనర్‌లలోనూ ఉపయోగిస్తారు. అవును, ఇది నిజమే. ఫాస్ఫారిక్ యాసిడ్ క్రిములను చంపడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకనే దాన్ని టాయిలెట్ క్లీనర్లలో వాడుతారు. అయితే ఈ విషయం తెలియని చాలా మంది కూల్‌డ్రింక్‌లను అమృతంలా సేవిస్తుంటారు. కానీ నిజానికి అసలు ఎవరైనా సరే.. కూల్ డ్రింక్‌లను తాగకూడదు.
ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల మనకు చర్మ, జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణాశయంతోపాటు పేగుల లోపలి వైపు చర్మం డ్యామేజ్ అవుతుంది. అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక కూల్‌డ్రింక్‌లను తాగడం మాని చక్కగా కొబ్బరిబొండాలు లేదా చెరుకు రసం తాగడం ఉత్తమం. దాంతో వేసవి తాపం తీరుతుంది. డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…