Chewing Gum : చూయింగ్ గ‌మ్‌లను త‌ర‌చూ తింటున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్‌..!

January 26, 2024 10:24 AM

Chewing Gum : మ‌న‌లో అధిక శాతం మందికి చూయింగ్ గ‌మ్‌ల‌ను తినే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు రోజూ అదే ప‌నిగా చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌ములుతుంటారు. దీని వ‌ల్ల ముఖానికి వ్యాయామం జ‌రుగుతుంద‌ని చెప్పి కొంద‌రు చూయింగ్ గ‌మ్‌ల‌ను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గ‌మ్‌లు మ‌న ఆరోగ్యానికి మంచివి కావ‌ట‌. వాటిని తింటే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

చూయింగ్ గ‌మ్‌ల‌ త‌యారీలో E171 (titanium dioxide nano particles) అనే స‌మ్మేళ‌నాన్ని వాడుతార‌ట‌. ఇది చూయింగ్ గ‌మ్‌ల‌కు ఒక నిర్దిష్ట‌మైన రంగును ఇస్తుంది. అయితే మ‌నం చూయింగ్ గ‌మ్‌ను తిన్న‌ప్పుడు ఈ స‌మ్మేళ‌నం కూడా మన జీర్ణాశ‌యంలోకి వెళ్లి అటు నుంచి ఇది పేగుల‌లోకి వెళ్లి అక్క‌డ బాక్టీరియాను వృద్ధి చేసి క్యాన్స‌ర్ వ‌చ్చేలా చేస్తుందట‌. దీంతో పెద్ద పేగు క్యాన్సర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

if you are taking Chewing Gum daily then this news is for you
Chewing Gum

ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివ‌ర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ వాయిసెస్కీ ఎలుక‌ల‌పై తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లో పై విష‌యం వెల్ల‌డైంది. దీంతో ఎవ‌రూ చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌రాద‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఆ E171 అనే ప‌దార్థాన్ని కేవ‌లం చూయింగ్ గ‌మ్‌ల‌లో మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర ఆహార ప‌దార్థా త‌యారీలోనూ వాడుతారట‌. క‌నుక మీరు బ‌య‌ట కొనుగోలు చేసి తినే ప్యాక్డ్ ఫుడ్స్‌ల‌లో ఈ స‌మ్మేళ‌నం ఉందో, లేదో వెరిఫై చేసుకుని మ‌రీ ఆ ఆహారాల‌ను తినండి. లేదంటే అన‌వ‌స‌రంగా క్యాన్స‌ర్ తెచ్చుకున్న వార‌వుతారు. ఆ త‌రువాత ఎంత బాధ‌ప‌డినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now