Chanakya : ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే.. ఇలా చెయ్యండి..!

December 28, 2023 6:00 PM

Chanakya : చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం చాలా బాగుంటుంది. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, మనల్ని మనం ఎంతగానో డెవలప్ చేసుకోవచ్చు. ఆచార్య చాణక్య, ఒక వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని, నిజస్వరూపాన్ని గుర్తించడానికి అనేక మార్గాలు ఉన్నట్లు చెప్పారు. చాణక్య చెప్పిన మార్గాల్లో నడుచుకుంటే ఒక వ్యక్తి నిజస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రవర్తన ని గమనిస్తే, ఆ వ్యక్తి ఎలాంటి వారనేది మనం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రతికూల పరిస్థితుల్ని కూడా ప్రశాంతంగా ప్రభావంతంగా ఎదుర్కొంటున్నట్లయితే, అతనికి గొప్ప సంకల్పం ఉందని అర్థం చేసుకోవచ్చు.

క్లిష్ట పరిస్థితులు ఈజీగా ఉద్రేకానికి, నిరాశకి గురైతే అలాంటి వాళ్లకు మానసిక ధైర్యం లేనట్లు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని మీరు గుర్తించాలంటే, వారి యొక్క నిర్ణయాలని మీరు చూడాలి. ఒక వ్యక్తి యొక్క చర్యలు, వాళ్ల యొక్క నమ్మకాలనే ప్రతిపాదిస్తాయి. అలానే, మీరు ఒకళ్ళని అంచనా వేయాలంటే, ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఎలాంటి భాష వాడుతున్నాడు..?, ఎటువంటి పదాలను ఉపయోగిస్తున్నాడు అనేది గమనించాలి. అతని భాష ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.

how to know one person attitude according to chanakya
Chanakya

మాటలు మనిషి యొక్క మనసును తెలియజేస్తాయి. ఒక వ్యక్తి నిజాయితీగా మాట్లాడినప్పుడు ఒక టోన్లో, అబద్ధాలు చెప్తున్నప్పుడు ఇంకొక టోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా దీనిని గమనించి కూడా మీరు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. అలానే మనిషి యొక్క ప్రవర్తన, కమ్యూనికేషన్ ని గమనించడంతో పాటుగా ఒక వ్యక్తి సంబంధాలు, సోషల్ సర్కిల్ ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటే, ఇతరులు బాగా ఇష్టపడితే దయా, దాతృత్వం ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. చాణక్య నీతి ప్రకారం, వివిధ పరిస్థితుల్లో వారి ప్రవర్తన, చర్యలు, నిర్ణయాలు, మాటలు అటువంటివన్నీ కూడా వ్యక్తి స్వభావాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. వీటిని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, ఒక వ్యక్తి నిజమైన స్వభావని మీరు అర్థం చేసుకోవచ్చు. నిజ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now