lifestyle

How To Grow Cucumber At Home : మీ ఇంట్లో కాస్త స్థ‌లం ఉందా.. అయితే ఎంచ‌క్కా కీర‌దోస‌ల‌ను ఇలా పెంచుకోవ‌చ్చు..!

How To Grow Cucumber At Home : మ‌న‌లో అధిక‌శాతం మందికి ఇండ్ల‌లో కూర‌గాయ‌ల‌ను పెంచాల‌నే త‌ప‌న ఉంటుంది. కానీ కొంద‌రికి స్థ‌లాభావం వ‌ల్ల అది వీలు కాదు. ఇక స్థ‌లం ఉన్న‌వారు కూడా కూర‌గాయ‌ల‌ను ఎలా పెంచాలా..? అని సందేహిస్తుంటారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర త‌గినంత స్థ‌లం ఉండేవారు పెద్ద‌గా శ్ర‌మ ప‌డ‌కుండానే సుల‌భంగా కీర‌దోసను ఇంట్లోనే పెంచ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏమేం చేయాలో, ఏమేం వ‌స్తువులు అవ‌స‌రం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా. కీర‌దోస‌ను ఎండ‌లో పెంచాల్సి ఉంటుంది. అందుక‌ని నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు సూర్య‌ర‌శ్మి త‌గిలే స్థలంలో వాటిని పెంచాలి. ఇక వెడ‌ల్పాటి మూతి ఉన్న కుండీలో లేదా కావ‌ల్సిన స్థ‌లం ఉంటే అందులోనూ కీర‌దోస‌ను పెంచ‌వ‌చ్చు. అయితే కుండీ విష‌యానికి వ‌స్తే దాని వ్యాసం కనీసం 18 నుంచి 24 ఇంచులు ఉండాలి. ఎందుకంటే కీర‌దోస మొక్క పెరిగే కొద్దీ బాగా విస్త‌రిస్తుంది క‌నుక ఆ మాత్రం వెడ‌ల్పు ఉండాలి. ఇక విత్త‌నాలు నాటిన చోట 2 అడుగుల పొడ‌వైన ఓ స‌న్న‌ని క‌ర్ర‌ను కూడా మొక్క‌కు స‌పోర్ట్ కోసం పాత‌వ‌చ్చు.

కూర‌గాయల‌ను పెంచేందుకు అవ‌స‌రం ఉన్న మ‌ట్టిని కీర‌దోస పెంప‌కానికి వాడాలి. సాధార‌ణ తోట మ‌ట్టిలో క‌లుపు మొక్క‌లు బాగా పెరుగుతాయి. అలాగే అందులో హానికార‌క బాక్టీరియా కూడా ఉంటుంది. క‌నుక ఆ మ‌ట్టిని వాడ‌కూడ‌దు. ప్ర‌త్యేకంగా సిద్ధం చేసుకున్న మ‌ట్టిలో సేంద్రీయ ఎరువులు క‌లిపి ఆ మ‌ట్టిని కీర‌దోస పెంప‌కం కోసం వాడాలి. ఆ మ‌ట్టిలో మొక్క‌ల‌కు అన్ని ర‌కాల మిన‌రల్స్ అందేలా చూసుకోవాలి. నైట్రోజ‌న్‌, పొటాషియం, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు మొక్క‌ల‌కు అందేలా మ‌ట్టిని సిద్ధం చేయాలి. కీర‌దోస విత్త‌నాల‌ను కేవ‌లం 1 ఇంచు లోప‌ల విత్తుకుంటే చాలు. త్వ‌ర‌గా మొల‌క‌లు వ‌స్తాయి. ఇక విత్త‌నానికి, విత్త‌నానికి న‌డుమ క‌నీసం 6 ఇంచుల స్థ‌లం వ‌ద‌లాలి. విత్త‌నాలు విత్తాక వాటిపై మ‌ట్టి క‌ప్పి.. కొంచెం నీరు పోస్తే చాలు. మొల‌క‌లు త్వ‌ర‌గా వ‌చ్చి మొక్క‌లు పెరుగుతాయి.

How To Grow Cucumber At Home

విత్త‌నాల‌ను నాట‌డంతోనే మ‌న ప‌ని అయిపోతుంద‌ని భావించ‌కూడ‌దు. విత్త‌నాలు మొల‌క‌లుగా మారి, అవి మొక్క‌లుగా పెరిగి, కాపు కాసే వ‌ర‌కు వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లను మ‌రువ‌కూడ‌దు. ముఖ్యంగా కాయ‌లు ఎక్కువ‌గా రావాలంటే నీటిని బాగా పోయాల్సి ఉంటుంది. క‌నీసం ప్ర‌తి 10 రోజుల‌కు ఒక‌సారి అయినా సేంద్రీయ ఎరువుల‌ను వేయాలి. మొక్క‌లు పెరిగేట‌ప్పుడు చీడ పీడ‌లు ప‌ట్ట‌డం స‌హ‌జ‌మే. అయితే వీటిని బేకింగ్ సోడా – నీరు మిశ్ర‌మం లేదా నీమ్ ఆయిల్ స్ప్రేల‌తో వ‌దిలించుకోవ‌చ్చు. క్రిమి సంహార‌క మందుల‌ను వాడాల్సిన ప‌నిలేదు. ఇక మొక్క‌ల‌కు త‌గినంత సూర్య‌ర‌శ్మి అందేలా చూసుకుంటే చాలా వ‌ర‌కు చీడ పీడ‌ల బాధ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మొక్క‌లు పెరిగే క్ర‌మంలో చీడ పీడ‌ల బారిన ప‌డ్డ ఆకులు, పువ్వుల‌ను కోసేయాలి. దీంతో ఇత‌ర ఆకులు, పువ్వుల‌కు అవి వ్యాప్తి చెంద‌కుండా ఉంటాయి. అయితే చెడిపోయిన ఆకులు, పువ్వుల‌ను ఉద‌యాన్నే తొల‌గిస్తే మంచిది.

కీర‌దోస పండేందుకు సుమారుగా 50 నుంచి 70 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అయితే పంట పండ‌గానే కాదు, స‌రైన స‌మయంలో పంట‌ను తీయ‌డం కూడా ముఖ్య‌మే. పువ్వులు వ‌చ్చిన 10 రోజుల త‌రువాత కీర‌దోస కాయ‌ల‌ను కోయాల్సి ఉంటుంది. కీర‌దోస కాయ‌లు ప‌సుపు రంగులోకి మారితే అవి చేదుగా ఉంటాయి. క‌నుక ఆ స్థితికి రాక మునుపే కాయ‌ల‌ను కోయాల్సి ఉంటుంది. ఇక కాయ కాండానికి కొద్దిగా పైకే కాయ‌ల‌ను కోస్తే త‌రువాత కొత్త కాయ‌లు వ‌చ్చేందుకు, పువ్వులు బాగా పూసేందుకు అవ‌కాశం ఉంటుంది. కోసిన కాయలు స‌హ‌జంగానే 3 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే కోసిన వెంట‌నే శీత‌ల వాతావ‌ర‌ణంలో కాయ‌ల‌ను ఉంచాలి. ఇలా ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే త‌గినంత స్థ‌లం ఉండే వారు కీర‌దోసను చ‌క్కగా పెంచుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM