Garikapati Narasimha Rao : మనలో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో పానీపూరీ కూడా ఒకటి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మనక లభిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్కడపడితే అక్కడ ఇది మనకు లభిస్తూ ఉంటుంది. ఎక్కువగా రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. ప్రజలు ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది వ్యాపారులు దీనిని శుభ్రత లేకుండా తయారు చేస్తారు. పానీపూరీలో నీటిని ఏ నీటితో తయారు చేస్తారో తెలియదు. అందులో వాడే కూరను కూడా అపరిశుభ్ర వాతావరణంలోనే తయారు చేస్తారు. అలాగే ఈ నీటిని చేత్తో కలుపుతూ ఉంటారు. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండానే ప్రజలకు వాటిని అందిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఈ పానీపూరీ బండ్లను ఎక్కువగా రోడ్ల పక్కన మురికి కాలువల పక్కన ఉంచుతారు. పానీపూరీ బండి దగ్గరికి వెళ్లగానే ముందుగా మనకు మురికి కాలువ వాసన వస్తుందని చెప్పవచ్చు. అలాగే అక్కడ ఉండే ఈగలు పానీపూరీ చేసే వస్తువులపై వాలడం కూడా జరుగుతుంది. అయినప్పటికి ప్రజలు వాటినే తినడానికి ఇష్టపడతారు. ఈ పానీపూరీ చేసే వారు కూడా చెమటలు పట్టి అపరిశుభ్రంగానే ఉంటారు. ఇలాంటి వాతావరణంలో తయారు చేసిన పానీపూరీని తీసుకోవడం వల్ల మనం అనారోగ్యాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఈ పానీపూరీ గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావుగారు మాట్లాడుతూ ఎంత అపరిశుభ్రంగా చేసినప్పటికి ప్రజలు ఇటువంటి వాటినే తినడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకునేటప్పుడు రుచితో పాటు సుచి కూడా చాలా ముఖ్యమని చెప్పారు. మనం తీసుకునే ఆహారానికి రుచి, సుచి అనే రెండు ప్రధాన లక్షణాలు ఉండాలని వారు తెలియజేసారు.
రుచి లేకపోయినప్పటికి మనం తీసుకునే ఆహారం తప్పకుండా సుచిగా ఉండాలని మన మొదటి ప్రాధాన్యం సుచికే ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పాడైపోయిన కేకులను కూడా పైన మంచిగా డెకరేట్ చేసి అమ్మేస్తున్నారని ప్రజలు వాటినే కొనుగోలు చేసి తింటున్నారని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోకుండానే వారికి ఇష్టమైన నటులు, క్రికెటర్లు చెప్పిన వాటిని కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసారు. కనుక ప్రజలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరమని తనదైన శైలిలో వ్యక్తపరిచారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…