lifestyle

Easter Ireland Sculptures : మౌనంగా చూస్తూ ఉండే శిల్పాలు.. వీటి వెనుక ఉన్న క‌థేమిటో తెలుసా..?

Easter Ireland Sculptures : క‌నుచూపు మేర‌లో ఎక్క‌డ చూసినా ప‌ర్వ‌తాల‌పై ప‌రుచుకున్న ప‌చ్చ‌ని గ‌డ్డి. చూద్దామంటే చెట్లు మ‌చ్చుకు ఒక్క‌టి కూడా క‌న‌ప‌డ‌వు. చిన్న చిన్న మొక్క‌లు, పొద‌లే అక్క‌డ‌క్క‌డా ఉంటాయి. వాటి మ‌ధ్య‌లో ఎన్నో వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌కు ఆన‌వాళ్లుగా నిలిచిన రాతి శిల్పాలు. మౌన ముద్ర‌లో.. మ‌మ్మ‌ల్ని ప‌ల‌క‌రించ‌కండి.. అన్న‌ట్లు చూస్తుంటాయి. ఈ అద్భుత‌మైన చారిత్ర‌క సంప‌ద చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేస్తుంటుంది. అందుకే ఆ సంప‌ద‌ను చూసేందుకు వేల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు ఏటా అక్క‌డికి వెళ్తుంటారు. అదే.. ఈస్ట‌ర్ ఐర్లాండ్‌ దీవి.. ఈ దీవిలో ఉన్న రాతి శిల్పాలు ఇక్క‌డి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.

చిలీ దేశానికి తూర్పు దిశ‌గా సుమారుగా 3600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌దే ఈస్ట‌ర్ ఐర్లాండ్‌ దీవి. ఈ దీవి ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో ఉంటుంది. దీని పొడ‌వు 25 కిలోమీట‌ర్లు. వెడ‌ల్పు 12 కిలోమీట‌ర్లు. ఈ దీవిలో పురాత‌న కాలం నుంచి ఉన్న రాతి శిల్పాలు ప‌ర్యాట‌కుల‌ను ముక్కున వేలేసుకునేలా చేస్తుంటాయి. అంత అద్భుతంగా వాటిని చెక్కారు. ఒక్కో శిల్పం సుమారుగా 15 నుంచి 33 అడుగుల ఎత్తు ఉంటుంది. పొడ‌వైన ముక్కు, పెద్ద చెవుల‌తో ఈ శిల్పాలు చూసేందుకు భ‌లే వింతగొల్పుతుంటాయి. ఈ శిల్పాల‌ను నొవాయ్ అని పిలుస్తారు. అయితే ఈ దీవిలో ఇలాంటి శిల్పాలు 887 వ‌ర‌కు ఉన్నాయి.

Easter Ireland Sculptures

నొవాయ్ శిల్పాల‌న్నీ ఏక‌శిలా విగ్ర‌హాలే. ఈ శిల్పాల కింద రాతి గ‌ద్దెలు ఉంటాయి. ఈ గ‌ద్దెల‌ను అహు అని పిలుస్తారు. ఇక ఈ శిల్పాల‌ను 1250 నుంచి 1500 సంవ‌త్స‌రాల కింద‌ట చెక్కిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. కాగా వీటిని ఈ దీవిలో నివాసం ఉండే రెప‌నూయీ తెగ ప్ర‌జ‌లే చెక్కి ఉంటార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అయితే ఈ శిల్పాల‌ను ఎందుకు చెక్కారు ? వాటిని ఎక్క‌డ చెక్కారు ? ఇక్క‌డిదాకా ఎందుకు తీసుకువ‌చ్చారు ? అన్న వివ‌రాలు మాత్రం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిలిపోయాయి.

కాగా ఈ దీవిలో ఉన్న రానోరారాకుప్ క్వారీలో ఇంకా ఏక‌శిల విగ్ర‌హాలు అలాంటివే కొన్ని ఉన్నాయ‌ట‌. అగ్ని ప‌ర్వ‌తం పేల‌డం వ‌ల్ల బ‌య‌ట‌కు చిమ్మిన లావా నుంచి ఏర్ప‌డ్డ శిల‌ల‌తో ఈ శిల్పాల‌ను చెక్కార‌ట‌. ఆ త‌రువాత ఆ శిల్పాల‌ను ఈ దీవిలోని అన్ని ప్రాంతాల‌కు త‌ర‌లించార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఇక ఈ దీవిలో పెద్ద చెట్లు ఒక్క‌టి కూడా క‌నిపించ‌వు. అది కూడా ఒక వింతే. ఇక ఈ దీవిలో ప్ర‌స్తుతం 6వేల మంది వ‌ర‌కు నివాసం ఉంటున్నారు. వారిలో 60 శాతం మంది రెప‌నూయీ తెగ‌కు చెందిన ప్ర‌జ‌లే కావ‌డం విశేషం. ఇక ఈ దీవిలో ఉన్న శిల్పాల‌ను చూసేందుకు ఇక్క‌డికి ఎంతో మంది ప‌ర్యాట‌కులు కూడా వ‌స్తుంటారు. ఏది ఏమైనా.. ఈ దీవిలోని శిల్పాలు భ‌లే వింత‌గా ఉన్నాయి క‌దా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM