Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. చూసేందుకు డ్రాగన్‌ను పోలిన ఆకృతి ఉంటుంది కనుకనే దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాలలో పండుతుంది. ఇక ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌లను పోలి ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున హార్ట్ సమస్యలు రావు. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…