lifestyle

Nutrients : మ‌న శ‌రీరానికి అస‌లు ఏయే పోష‌కాలు కావాలో తెలుసా..?

Nutrients : మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే పోషకాలు అంటే.. సాధారణంగా చాలా మంది విటమిన్లు, మినరల్స్ మాత్రమేననుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే పోషకాలు రెండు రకాలు. అవి 1. స్థూల పోషకాలు. 2. సూక్ష్మ పోషకాలు. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్థూల పోషకాలు..

కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు), ప్రోటీన్లు (మాంసకృత్తులు), ఫ్యాట్స్ (కొవ్వులు).. ఈ మూడింటినీ స్థూల పోషకాలు అని అంటారు. ఎందుకంటే ఇవి నిత్యం మన శరీరానికి పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. అందుకనే వీటిని స్థూలపోషకాలు అంటారు. ఇక వీటిలో కార్బొహైడ్రేట్ల వల్ల మనకు శక్తి లభిస్తుంది. నిత్యం మనం యాక్టివ్‌గా పనిచేసేందుకు కావల్సిన శక్తి మనకు వీటివల్లే లభిస్తుంది. అలాగే ప్రోటీన్ల వల్ల మన శరీరంలో కండరాలు నిర్మాణమవుతాయి. పాత కణజాలం పోయి కొత్త కణజాలం ఏర్పడుతుంది. శరీర నిర్మాణం జరుగుతుంది. ఇక కొవ్వులతో మన శరీరం భవిష్యత్ శక్తి అవసరాలకు కావల్సిన ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అలాగే పలు విటమిన్లు, మినరల్స్‌ను మన శరీరం సరిగ్గా శోషించుకునేందుకు కూడా కొవ్వులు పనికొస్తాయి.

Nutrients

సూక్ష్మ పోషకాలు..

మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి నిత్యం మనకు చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అందుకనే వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. విటమిన్ ఎ, బి1 (థయామిన్), బి2 (రైబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), బి5 (పాంటోథెనిక్ యాసిడ్), బి6 (పైరిడాక్సిన్), బి7 (బయోటిన్), బి9 (ఫోలేట్), బి12 (సయానో కోబాలమిన్), విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్), విటమిన్ డి (డి3), ఇ, కె, కె2లు విటమిన్ల జాబితాలోకి వస్తాయి.

అలాగే కాల్షియం, పాస్ఫరస్, మెగ్నిషియం, సోడియం, క్లోరైడ్, పొటాషియం, సల్ఫర్, ఐరన్, మాంగనీస్, కాపర్, జింక్, అయోడిన్, ఫ్లోరైడ్, సెలీనియం తదితర పదార్థాలను మినరల్స్ అంటారు. మనకు విటమిన్లు, మినరల్స్ నిత్యం అవసరం అవుతాయి. అయితే ఆడ, మగ, పిల్లా పెద్దా వయస్సును బట్టి ఆయా విటమిన్లు, మినరల్స్‌ను నిత్యం మనం తీసుకోవాల్సిన మోతాదులు మారుతుంటాయి. ఈ క్రమంలో ఎవరైనా సరే.. నిత్యం తమ ఆహారంలో అన్ని స్థూల పోషకాలు, అన్ని సూక్ష్మ పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆయా పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM