Cucumber Smoothie : వేసవి కాలంలో ఎవరైనా సరే.. శరీరాన్ని చల్లబరుచుకునేందుకు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. అయితే శీతల పానీయాల్లో కూల్‌డ్రింక్‌లు కాకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్‌డ్రింక్స్ అయితే మనకు ఎలాంటి పోషకాలను అందివ్వవు. అలాగే శరీరాన్ని చల్లబరచవు. కానీ సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడిన పానీయాలు అయితే మనకు అటు పోషణ, ఇటు చల్లదనం రెండూ లభిస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో కీరదోస స్మూతీ కూడా ఒకటి. దీన్ని వేసవిలో తాగితే మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి శరీరం ఉన్నవారు ఈ స్మూతీని ఎప్పుడైనా సరే తాగవచ్చు. అలాగే పలు పోషకాలు కూడా అందుతాయి. మరి కీరదోస స్మూతీ ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కీరదోస స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చల్లని పెరుగు – 270 గ్రాములు, కీరదోస పేస్ట్ – 200 గ్రాములు, కట్ చేసిన టమాటాలు – 10 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – తగినంత.
కీరదోస స్మూతీ తయారు చేసే విధానం..
పైన చెప్పిన అన్ని పదార్థాలను బాగా కలిపి మిక్సీ పట్టాలి. జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంత నీరు కలపవచ్చు. దీంతో కీరదోస స్మూతీ తయారవుతుంది. ఉప్పు, మిరియాల పొడిలను టేస్ట్‌కు సరిపడా కలుపుకుంటే చాలు.. చల్ల చల్లని కీరదోస స్మూతీ రెడీ అయినట్టే.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…