Cucumber Lassi : చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

January 26, 2024 2:24 PM

Cucumber Lassi : ఎండ‌లో నుంచి వ‌చ్చిన వారు చల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీ తాగితే వేడి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మనం పొంద‌వ‌చ్చు. దీంతోపాటు శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం కూడా ల‌భిస్తుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌రి కీర‌దోస ల‌స్సీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

కీర‌దోస ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కీర‌దోస కాయ‌లు – 2, పెరుగు – అర లీట‌ర్, అల్లం – 2 అంగుళాల ముక్క, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ప‌చ్చిమిర‌ప కాయ‌లు – 2, చ‌క్కెర – 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత.

Cucumber Lassi recipe very tasty and healthy drink
Cucumber Lassi

కీర‌దోస ల‌స్సీని త‌యారు చేసే విధానం..

కీర‌దోస‌కాయ ముక్క‌లు, అల్లం, కొత్తిమీర‌, ప‌చ్చిమిర‌ప కాయలు, చ‌క్కెర, ఇంగువ‌, ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి బాగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ప‌ట్టుకోవాలి. అందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ మెత్త‌గా ప‌ట్టాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని గ్లాసులో పోస్తే చాలు.. కీర‌దోస ల‌స్సీ త‌యార‌వుతుంది. అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చ‌ల్ల చ‌ల్ల‌గా కీర‌దోస ల‌స్సీని తాగ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now