Pop Corn : అధిక బరువు తగ్గేందుకు అనేక మంది వెయిట్ లాస్ డైట్ ప్లాన్లను పాటిస్తుంటారు. అయితే ఆ ప్లాన్లలో చేర్చుకోవాల్సిన ఉత్తమ స్నాక్‌గా పాప్‌కార్న్‌ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇతర ఏ తరహా స్నాక్స్‌ను తీసుకున్నా.. చాలా మంది బరువును పెంచే స్నాక్స్‌నే తింటుంటారు. కానీ పాప్‌కార్న్ అలా కాదు.. బరువు తగ్గిస్తుంది. అలాగే స్నాక్‌గా కూడా ఉపయోగపడుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా చాలా మంది మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు నడుమ.. సాయంత్రం సమయంలో స్నాక్స్ తింటుంటారు. ఆ సమయంలో చిరుతిండి కాకుండా పాప్‌కార్న్ తింటే.. అటు స్నాక్స్ తినాలనే మోజు తీరుతుంది. దీంతోపాటు బరువు కూడా తగ్గవచ్చు.
పాప్‌కార్న్‌తో మన శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల దీన్ని ఈవెనింగ్ స్నాక్‌గా చేసుకోవచ్చు. వెయిట్‌లాస్ డైట్ ప్లాన్‌లో ఉన్నవారు పాప్‌కార్న్‌ను చక్కని స్నాక్స్‌గా తినవచ్చు. ఒక కప్పు సాధారణ పాప్‌కార్న్‌లో కేవలం 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ వాటిని తినడం వల్ల శరీరానికి బోలెడు ఫైబర్ అందుతుంది. ఇది శరీర జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అంతేకాదు, ఎక్కువ సేపు ఉన్నా ఆకలి కాకుండా చూస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన ప్రకారం.. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. అందువల్ల ఒళ్లు నొప్పులు ఉన్నవారు పాప్‌కార్న్‌ను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక మనకు 75 గ్రాముల సాధారణ పాప్‌కార్న్‌లో 300 మిల్లీగ్రాముల పాలీఫినాల్స్ లభిస్తాయి. అందువల్ల పాప్‌కార్న్ మనకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
ఇక మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు పాప్‌కార్న్‌లో ఉంటాయి. అలాగే డయాబెటిస్ ఉన్నవారు పాప్‌కార్న్‌ను తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇక జీర్ణ సమస్యలు ఉన్నవారికి పాప్‌కార్న్ ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. కాగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతున్న ప్రకారం.. పాప్‌కార్న్‌ను తరచూ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అలాగే పాప్‌కార్న్‌లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, జియాజాంతిన్ అనబడే సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కనుక.. పాప్‌కార్న్‌ను అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఇకపై స్నాక్స్ తినాలనుకుంటే.. పాప్‌కార్న్‌ను తినండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…