బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2691 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో నెలకు రూ.15వేల స్టయిపండ్ చెల్లిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుకు చెందిన శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, మాతృభాషపై పట్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.400 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు మార్చి 5ను చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://www.unionbankofindia.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…