ఉద్యోగాలు

భారత ఆర్మీలో భారీగా అగ్నివీర్ పోస్టులు.. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

అగ్నివీర్ నియామక ప్రక్రియను ప్రారంభించిన భారత సైన్యం. Photo Credit: Indian Army/Social Media.

భారత సైన్యం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 25వేల‌కు పైగా ఖాళీలు ఉన్న‌ట్లు తెలిపారు. ఇందులో జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్/స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, ఉమెన్ మిలిటరీ పోలీస్ వంటి విభాగాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 13, 2026 నుంచి ప్రారంభం కాగా ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగుతాయి. ఈ నియామక ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇది అగ్నిపథ్ పథకం కింద జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాల్సి ఉంటుంది.

ఖాళీలు, అర్హతలు..

ఈ నియామకాల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస శారీరక అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థి ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 77 సెం.మీ. (విస్తరణ లేకుండా) ఉండాలి. ఛాతీ విస్తరణ కనీసం 5 సెం.మీ. ఉండాలి. అన్ని విభాగాల అభ్యర్థులకు రూ.250 ప్రాసెసింగ్ ఫీజు నిర్ణయించారు. ఈ ఫీజును SBI పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.

ఎంపిక విధానం, పరీక్షా విధానం..

అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT/CEE) నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లిష్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ సబ్జెక్టులు అభ్యర్థి దరఖాస్తు చేసిన పోస్టును బట్టి మారుతాయి.

జీడీ పోస్టులకు 50 ప్రశ్నలు – 100 మార్కులు, టెక్నికల్, క్లర్క్/స్టోర్‌కీపర్ పోస్టులకు 50 ప్రశ్నలు – 200 మార్కులు ఉంటాయి. CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశగా రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో 1.6 కిలోమీటర్ల పరుగు, పుల్-అప్స్, 9 అడుగుల డిచ్, జిగ్-జాగ్ బ్యాలెన్స్, శారీరక కొలతల పరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

అగ్నిపథ్ పథకం కింద వేతన విధానం..

ఎంపికైన అగ్నివీర్లకు ప్రత్యేకంగా రూపొందించిన వేతన విధానం అమలు చేస్తారు. మొదటి సంవత్సరంలో రూ.30,000 నెల జీతం లభిస్తుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది రూ.5,000 చొప్పున పెరిగి నాలుగో ఏడాదికి రూ.40,000కు చేరుతుంది. ఇందులో నుంచి 30 శాతం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. దీంతో మొదటి ఏడాది ఇన్‌హ్యాండ్ జీతం రూ.21,000, నాలుగో ఏడాదికి రూ.28,000 వరకు ల‌భిస్తుంది. ఈ కార్పస్ ఫండ్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా సమానంగా వాటా వేస్తుంది.

గ‌మ‌నిక‌: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026కు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్, దరఖాస్తు లింక్‌లు భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్య‌ర్థులు అధికారిక నోటిఫికేష‌న్ లేదా వెబ్ సైట్‌ను సంద‌ర్శించి వివ‌రాల‌ను ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది. అప్ డేట్స్ కోసం స‌ద‌రు వెబ్‌సైట్‌ను త‌ర‌చూ విజిట్ చేయాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM