వినోదం

“చికిరి చికిరి” హుక్ స్టెప్ వెనుక అసలు సీక్రెట్.. రామ్ చరణ్ ఐడియా చూసి జానీ మాస్టర్ ఎమోషనల్!

రామ్ చరణ్ సృజనాత్మకతను ప్రశంసించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. Photo Credit: Peddi Movie Team/Jani Master/X/Instagram.

రామ్‌చరణ్ నటించిన పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని హుక్ స్టెప్ ముఖ్యంగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన రహస్యాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బయటపెట్టారు.

ఒక డాన్స్ షోలో మాట్లాడిన జానీ మాస్టర్ చికిరి చికిరి పాటలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యాట్ స్టెప్ పూర్తిగా రామ్‌చరణ్ ఆలోచన నుంచే వచ్చిందని వెల్లడించారు. బ్యాట్‌ను పట్టుకునే తీరు, దానితో చేసే ప్రత్యేకమైన కదలికలు అన్నీ చరణ్ స్వయంగా సూచించారని చెప్పారు.

ఈ స్టెప్‌ను చరణ్ కేవలం సూచించడమే కాకుండా, తానే ముందుగా ప్రాక్టీస్ చేసి జానీ మాస్టర్‌కు చేసి చూపించారని తెలిపారు. ప్రేక్షకులకు ఇది క‌చ్చితంగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే చరణ్ ఈ స్టెప్‌ను ప్రెజెంట్ చేశారని ఆయన గుర్తుచేశారు.

ఈ సందర్భాన్ని తలుచుకుంటూ జానీ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. స్టెప్ ఆలోచన పూర్తిగా చరణ్ నుంచే వచ్చినప్పటికీ, ఆయన ఎప్పుడూ కొరియోగ్రాఫర్లకే పూర్తి క్రెడిట్ ఇస్తారని, అది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని చెప్పారు.

చికిరి చికిరి పాట రామ్‌చరణ్ నటిస్తున్న రాబోయే చిత్రం పెద్ది లోనిది కాగా ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. భారీ అంచనాల మధ్య పెద్ది చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM