వినోదం

రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ అప్‌డేట్.. 50 శాతం పూర్తి, రామాయణ ఎపిసోడ్‌పై క్లారిటీ!

‘వారణాసి’ చిత్ర విశేషాలను వెల్లడించిన జక్కన్న. Photo Credit: SS Rajamouli/X.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అనంత‌రం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్న ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమాను నిదానంగానే ప్రారంభించినా ప్ర‌స్తుతం షూటింగ్ మాత్రం శ‌ర‌వేగంగానే కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న వార‌ణాసి సినిమాకు సంబంధించిన విశేషాల‌కు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలోఆయ‌న వెల్ల‌డించారు. వార‌ణాసి షూటింగ్ దాదాపుగా 50 శాతం వ‌ర‌కు పూర్త‌యింద‌ని చెప్పిన రాజ‌మౌళి మిగిలిన భాగాన్ని వీలైనంత త్వ‌ర‌గా కంప్లీట్ చేస్తామ‌ని తెలిపారు. సినిమాలో కీల‌క ఘ‌ట్టంగా భావిస్తున్న రామాయ‌ణ స‌న్నివేశాల‌ను ఇప్ప‌టికే మొత్తం పూర్తి చేశామ‌ని, అయితే సినిమాలో ఇంకా 50 శాతం షూటింగ్ మిగిలి ఉంద‌ని, దాన్ని జూన్ 2026 వ‌ర‌కు పూర్తి చేస్తామ‌ని రాజ‌మౌళి తెలిపారు.

విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ చాలా ఉంది: రాజ‌మౌళి

సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే త‌న ఫోక‌స్ ను పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై పెట్ట‌నున్న‌ట్లు రాజ‌మౌళి తెలిపారు. ముఖ్యంగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ చాలా ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వార‌ణాసి సినిమాలో మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆయ‌న‌కు జోడీగా ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ర‌న్ టైం సుమారుగా 3 గంటలు ఉంటుంద‌ని రాజ‌మౌళి తెలిపారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలాగా వార‌ణాసిలో నాటు నాటు లాంటి పాట‌ను పెట్ట‌డం లేద‌ని, క‌నుక అభిమానులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచించారు.

ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు..

అయితే సినిమాను ప్ర‌భావితం చేసేంత‌గా నాటు నాటు లాంటి పాట‌లు లేక‌పోయినా వార‌ణాసిలో మాత్రం అద్భుత‌మైన ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు, అత్యంత భారీ నిర్మాణాత్మ‌క విలువ‌లు క‌లిగిన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు కొదువ లేద‌ని రాజ‌మౌళి స్ప‌ష్టం చేశారు. ముఖ్యంగా కొన్ని కీల‌క స‌న్నివేశాలు, ఓ ముఖ్య‌మైన ఘ‌ట్టానికి సంబంధించి వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ అధికంగా చేయాల్సి ఉంటుంద‌ని, అందుకు చాలా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని రాజ‌మౌళి చెప్పారు. కాగా వార‌ణాసి సినిమాలో మ‌ళ‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ మూవీని 2027 ఏప్రిల్ మొద‌టి లేదా చివ‌రి వారంలో స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా రిలీజ్ చేయ‌నున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM