టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న మహేష్‌బాబు వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. భారీ పాన్-వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ సూపర్‌స్టార్ తాజాగా తన జీవితంలో అత్యంత సన్నిహితులు ఎవరో స్వయంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణ తనయుడిగా సినీ రంగంలోకి వచ్చిన మహేష్‌బాబు తండ్రి ఎదుర్కొన్న ఒడిదుడుకులను దగ్గర నుంచి చూశారు. అందుకే పరిమాణం కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తూ, సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా అది పెద్ద ప్రభావం చూపేలా కెరీర్‌ను మలుచుకున్నారు. ఇలా ఆయన పాటిస్తున్న వ్యవహార శైలి ఎంతో మందిని ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.
సహజంగా మితభాషి అయిన మహేష్‌బాబు ఎక్కువగా మాట్లాడరు. పరిచయాలు ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్రత్యేకంగా ఎవరినీ చెప్పుకోరు. షూటింగ్‌లకు దూరంగా ఉన్నప్పుడు తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తూ, తరచూ విదేశీ విహారయాత్రలకు వెళ్లడం ఆయన అలవాటు. ఇటీవల హీరోగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ను మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని ప్రశ్నించగా, క్షణం కూడా ఆలోచించకుండా నా భార్య అని సమాధానమిచ్చారు. ఈ ఒక్క మాటతోనే నమ్రత శిరోద్కర్ తన జీవితంలో, కెరీర్‌లో ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది.
ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, మహేష్ కెరీర్‌పై నమ్రత సలహాలు, సూచనలు గణనీయమైన ప్రభావం చూపినట్లు చెబుతారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత ఆయన మళ్లీ నిలదొక్కుకోవడంలో ఆమె పాత్ర కీలకమన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. వంశీ పైడిపల్లి వంటి దర్శకులతో మహేష్ సెలవులకు వెళ్లినా, వ్యక్తిగతంగా మాత్రం దూరమే పాటిస్తారు. కార్యక్రమాల్లో అందరితో స్నేహపూర్వకంగా కనిపించినా, తన ఖాళీ సమయాన్ని మాత్రం కుటుంబానికే పరిమితం చేస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబు.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం వారణాసితో పాన్-వరల్డ్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది.
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్‌పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…