
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును కమిషన్ పొడిగించింది. అభ్యర్థులు ఇప్పుడు 2026 జనవరి 29 రాత్రి 11:59 గంటల వరకు రిజిస్ట్రేషన్‌తో పాటు ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంటర్ లెవల్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన అతిపెద్ద నియామకాల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. మొత్తం 24,492 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 2025 అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు పెద్ద ఎత్తున స్పందన లభించడంతో, మరింత మందికి అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు BSSC వెల్లడించింది.
నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు..
ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను BSSC 2025 సెప్టెంబర్ 27న విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 15, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరి తేదీని జనవరి 29, 2026 వరకు పొడిగించారు. పూర్తిగా దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయడానికి గడువు జనవరి 31, 2026 వరకు ఉంటుందని కమిషన్ తెలిపింది. పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. పరీక్షకు ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు.
ఖాళీల వివరాలు – వర్గాల వారీగా..
- ఈ నియామక ప్రక్రియలో మొత్తం 24,492 పోస్టులు భర్తీ చేయనున్నారు. వర్గాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
- సాధారణ (General) – 10,753
- ఈడబ్ల్యూఎస్ (EWS) – 3,407
- బీసీ – 231
- బీసీ మహిళలు – 811
- ఈబీసీ – 2,678
- ఎస్సీ – 4,185
- ఎస్టీ – 2,427
దరఖాస్తు విధానం..
- అభ్యర్థులు BSSC అధికారిక వెబ్‌సైట్ (https://www.onlinebssc.com/25interlevela/), (https://www.onlinebssc.com/25interlevela/) ను సందర్శించాలి.
- అక్కడ BSSC Inter Level Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి.
- అనంతరం అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
- చివరగా ఫాం సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
అర్హతలు, వయస్సు పరిమితి, ఫీజు..
- అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు లెక్కింపు తేదీ: 2025 ఆగస్టు 1 నాటికి.
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
- గరిష్ట వయస్సు: సాధారణ పురుషులు: 37 సంవత్సరాలు, సాధారణ మహిళలు ( బీసీ, ఈబీసీ) : 40 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ: 42 సంవత్సరాలు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.
- అప్లికేషన్ ఫీజు: అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.100 మాత్రమే. ఫీజు చెల్లింపు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లోనే చేయాలి.
- లింక్: https://bssc.bihar.gov.in/
ఎంపిక ప్రక్రియ..
ఈ నియామకాల్లో అభ్యర్థులను ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష, అనంతరం మెయిన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. చివరిదశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గడువు ముగిసేలోపు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని, చివరి తేదీల కోసం వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోవాలని BSSC సూచించింది.








