టెర్రాకోట వస్తువులను అమ్ముతూ నెలకు రూ.40వేలు సంపాదిస్తున్న కార్మికులు.. అంతా ఆ ఇద్దరి చలవే..!!

September 10, 2021 9:31 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో యాంత్రీకరణ జరుగుతోంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతోంది. అన్ని పనులనూ యంత్రాలే చేస్తున్నాయి. దీని వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారిలో టెర్రాకోట ఉత్పత్తులను తయారు చేసే కార్మికులు కూడా ఒకరు. అయితే అలాంటి కార్మికులు ఇప్పుడు నెల నెలా చక్కని ఆదాయం పొందుతున్నారు. అదంతా ఆ ఇద్దరి చలవే అని చెప్పవచ్చు.

టెర్రాకోట వస్తువులను అమ్ముతూ నెలకు రూ.40వేలు సంపాదిస్తున్న కార్మికులు.. అంతా ఆ ఇద్దరి చలవే..!!

అభినవ్‌ అగర్వాల్‌, మేఘా జోషి అనే ఇద్దరు యువత మిట్టిహబ్‌ (Mittihub) అనే ఆన్‌లైన్‌ స్టోర్‌ను 2020లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారు మొత్తం 25 మంది కార్మికులతో ఆ కంపెనీని చిన్నగా నెలకొల్పారు. అందుకు రూ.50వేల పెట్టుబడి పెట్టారు. అంతే.. కార్మికులు రూపొందించిన ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభించింది. దీంతో వారు వెను దిరిగి చూడలేదు.

టెర్రాకోట వస్తువులను అమ్ముతూ నెలకు రూ.40వేలు సంపాదిస్తున్న కార్మికులు.. అంతా ఆ ఇద్దరి చలవే..!!

అలా ఆ ఇద్దరు యువత చేసిన పని వల్ల 25 మంది కార్మికులకు ఉపాధి లభ్యమైంది. దీంతో గతంలో వారు నెలకు రూ.15వేలు కూడా సంపాదించేవారు కాదు. కానీ ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నారు. వారు రూపొందించిన టెర్రాకోట ఉత్పత్తులను ఆ ఇద్దరు ఆన్ లైన్‌లో విక్రయిస్తున్నారు. దీంతో ఆ కార్మికులకు ఉపాధి లభిస్తోంది.

టెర్రాకోట వస్తువులను అమ్ముతూ నెలకు రూ.40వేలు సంపాదిస్తున్న కార్మికులు.. అంతా ఆ ఇద్దరి చలవే..!!

రాజస్తాన్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ విధంగా టెర్రాకోట వస్తువులను తయారు చేసి విక్రయిస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. మనస్సుంటే మార్గముంటుందని, ఎవరైనా ఎవరికైనా సహాయం చేయవచ్చని ఆ ఇద్దరు యువత నిరూపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment